Mouth Ulcer: నోటి పూతతో ఎక్కువ మంది బాధపడుతుంటారు. నోటిపూత అంటే వేరే ఏదో కాదు నోటి అల్సర్. ఈ నోటి పూత అయితే ఏమీ తినలేము. ఈ సమస్యను చాలా మందే ఎదుర్కొని ఉంటారు. నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నోటి పూత వల్ల ఆహారం తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఏది తిన్నా నోరంతా మండుతుంది. అయితే నోటి పూత కోసం ఎక్కువ మంది డాక్టర్ల దగ్గకు వెళతారు.. అలాగే మరికొందరు అయితే తమకు పరిచయం ఉన్న మెడికల్ షాపు వారిని అడిగి టాబ్లెట్లు తీసుకోవడం చేస్తుంటారు. కానీ చాలా మందికి తెలియంది ఏమిటంటే.. కిచెన్‌లో ఉండే కొన్ని ఆహార పదార్థాలతో నోటిపూతను దూరం చేసుకోవచ్చని.. త్వరగా నోటి అల్సర్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇపుడు చూద్దాం..
Read also: China: చైనాలో ఘోర ప్రమాదం.. రెస్టారెంట్‌లో ఎల్‌పిజి లీక్.. 31 మంది దుర్మరణం..
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. పలు రకాల అలర్జీలు, అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పనిచేస్తాయి. అందుకే రోజులో నాలుగైదుసార్లు తులసి ఆకులు నమలడం ద్వారా నోటి అల్సర్‌కు చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులు నమిలేటప్పుడు కొద్దిగా నీటిని తీసుకున్నట్లయితే ఆకుల రసం నోరంతా వ్యాపించి ఇంకా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కూరల్లో వాడే కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటి అల్సర్ల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులను వేడి నీటిలో వేసి ఉడికించి.. చల్లార్చిన తర్వాత ఆ రసంతో రోజుకు మూడుసార్లు పుకిలిస్తే నోటి అల్సర్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
Read also: Increase Blood Tips: ఈ జ్యూస్‌లు తాగితే.. శరీరంలో రక్తం ఇట్టే పెరుగుగుతుంది! టాబ్లెట్స్ అవసరం లేదు
ప్రతి కూరలో వాడే ఉల్లిగడ్డలోని సల్ఫర్ గుణాలు నోటి ఆల్సర్లను తగ్గించడంలో సహాయపడతాయి. చిన్న ఉల్లిగడ్డ ముక్కను నోటిలో అల్సర్ అయిన చోట ఉంచినా.. ఉల్లిరసంతో నోటిని పుకిలించినా ఫలితం ఉంటుంది. నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె కూడా చక్కగా పనిచేస్తుంది. అల్సర్ల కారణంగా నోరు పొడిబారుతుంది కాబట్టి .. నోటి పూత ఉన్న చోట తేనెను పూసినప్పుడు నోరు తేమగా మారి ఉపశమనం కలుగుతుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయాల్ గుణాల కారణంగా అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియా తొందరగా నాశనం అవుతుంది. ఇంకా తొందరగా తగ్గాలంటే తేనెతో పాటు కొద్దిగా పసుపు కూడా రాసినట్టయితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
Read also: Varahi navaratrulu: వైష్ణవి దేవి ఆరాధన అపారమైన జ్ఞాన సంపదను ప్రసాదిస్తుంది
నోటిలో పుండు అయిన చోట కొబ్బరి నూనెను రాయడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ఎండు కొబ్బరిని నమిలినా కూడా ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య తగ్గుతుంది. ఒక చెంచా గసగసాలను పొడి చేసి, దానికి ఒక చెంచా చక్కెరను కలిపి.. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి. దీనివల్ల అల్సర్ల సమస్య తగ్గుతుంది. నోటి అల్సర్ల తక్షణ ఉపశమనానికి ఐస్ ముక్కలతో మర్దన చేయాలి. తరచూ లవంగాలు నమలడంతో ఆ ఘాటు వల్ల కూడా సమస్య నోటిపూత తగ్గుతుంది. కాకపోతే లవంగాల ఘాటు వల్ల మొదట మంట ఎక్కువ అనిపిస్తుంటుంది. గోరువెచ్చటి నీటితో తరచూ పుకలించి ఉంచాలి. ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం వాడినా ఈ సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మూడు నెలలకొకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ బీ12 తగ్గినా ఈ సమస్య వస్తుంటుంది. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు బీ12 విటమిన్ టాబ్లెట్లు వాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా ఇంటిలో ఉండే కొన్ని ఆహార పదార్థాలు.. ఇతర వాటితో నోటి అల్సర్‌ను తగ్గించుకోవచ్చు.. కాబట్టి ఈ సారి నోటిపూత వచ్చినపుడు ప్రయత్నించి చూడండి..