Monsoon Health Tips: వర్షాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్లకండి..వెళితే దబిడిదిబిడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడిగా తినాలని అందరు అనుకుంటారు.. ముఖ్యంగా స్పైసీగా తీసుకోవాలని అనుకుంటారు.. అయితే, వర్షాకాలం ఆనందాన్నే కాదు.. రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ సీజన్‌లో అనారోగ్యాలు, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదలకు అనువుగా ఉండే కాలం. ఇది మనం తీసుకునే ఆహార పదార్థాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. తేమ పెరగడం వల్ల, రోజూ తినే పండ్లు, కూరగాయలపైనా.. బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలు ఎక్కువవుతాయి.. అందుకే ఈ వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
వంకాయలు బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ సమస్యను కూడా పెంచుతాయి, కాబట్టి వర్షాకాలంలో దీనిని తక్కువగా తినండి. వర్షాకాలంలో వంకాయలో కీటకాలు వేగంగా వృద్ధి చెందుతాయి. పొరపాటున మీరు వంకాయలతో పాటు ఈ కీటకాలను తింటే.. మీకు వాంతులు, దురద, అలెర్జీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. వంకాయలో ఆల్కలాయిడ్ ఉంటుంది.. ఇది శరీరానికి హానీ కలిగిస్తుంది..
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
అరటిపండ్లను ఏ సీజన్‌లోనైనా తినవచ్చు, కానీ మీరు అరటిపండ్లను సాయంత్రం, రాత్రి పూట, ఖాళీ కడుపుతో తింటే మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వర్షాకాలంలో అజీర్ణం, దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట అరటిపండ్లను తినకపోవడమే మంచిది. ఇది శరీరంలో కఫా దోషాన్ని తీవ్రం చేస్తుంది. శ్లేష్మం పెంచుతుంది. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ.. అందుకే ఈ సీజన్ లో ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి..
వర్షాకాలం స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలలో ఫంగస్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన బెర్రీలు తింటే జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి..
కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ స్రౌట్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే, వర్షాకాలంలో తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఈ కూరగాయలలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది..
వర్షాలకు ఆకు కూరలు తినేముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి..అందులో పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలు తినే ముందు జాగ్రత్త వహించాలి. అధిక తేమ కారణంగా.. ఈ ఆకులపై బ్యాక్టీరియా వృద్ధి ఎక్కువగా ఉంటుంది. వీటిని సరిగ్గా శుభ్రం చేయకుండా తీసుకుంటే.. జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.. వేడిగా, లైట్ గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!