Monsoon Hair Care Tips For Men: వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వెంట్రుకలు సరిగా ఆరకపోతే.. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా జుట్టు పొడిగా ఉంటుంది. దానివల్ల చుండ్రు సమస్యలు ప్రారంభం అవుతాయి. వర్షాకాలంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఏ నేపథ్యంలో మగవారు కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పురుషులు తమ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఓసారి చూద్దాం.
తేలికపాటి షాంపూ:
వర్షాకాలంలో జుట్టు కుదుళ్లకు హాని కలిగించే బ్యాక్టీరియా వాతావరణంలో ఉంటుంది. అందుకే జుట్టు కుదుళ్లను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో జుట్టు ఎక్కువసేపు తడిగా ఉంటే.. జుట్టు రాలడంమొదలవుతుంది. కాబట్టి వారానికి మూడుసార్లు తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి.
జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడొద్దు:
కొంతమంది పురుషులు ఈ సీజన్‌లో వివిధ రకాల జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు జిగటగా తయారవుతుంది. అందువల్ల రసాయనాలు అధికంగా ఉండే జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోవాలి. మీ జుట్టుకు నిమ్మరసం రాయడం మంచిది.
Also Read: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
అరగంటకు మించి ఉంచొద్దు:
జుట్టుకి రకరకాల పూతలు వేస్తుంటారు. వీటిని అరగంటకు మించి ఉంచొద్దు. లేదంటే జుట్టు బలహీనమై రాలిపోవచ్చు.
హెయిర్ కండిషనింగ్:
వర్షాకాలంలో ప్రతిరోజూ హెయిర్ కండిషనింగ్ చేయండి. ఎందుకంటే హెయిర్ స్కాల్ప్‌లో తేమను ఇది ఇట్టే తొలగిస్తుంది. జుట్టును పొడిగా ఉంచడం వల్ల వెంటుకలు చిట్లుతాయి.
కొబ్బరినూనె:
గోరువెచ్చని కొబ్బరినూనె, లేదా దానిలో కాస్త ఆముదాన్నో కలిపి తలకు రాసి మర్దన చేయాలి. ఇలా చేస్తే మాడుకి రక్తప్రసరణ అంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
హెయిర్ డ్రైయర్ వాడొద్దు:
వర్షాకాలంలో జుట్టుపై హెయిర్ డ్రైయర్ లేదా బ్లో డ్రైయర్ ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం వల్ల మీ జుట్టు విరిగిపోతుంది.
Also Read: Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా!