ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి ఉంటాయి..వర్షాకాలంలో అన్ని రకాల కూరగాయలు పుష్కలంగా దొరుకుతాయి. ఆరోగ్యాన్ని పెంచే ఈ కూరగాయలను వదిలి, నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కోడి గుడ్డు.. రోజుకు ఒక గుడ్డు తినాలని డాక్టర్లు సూచిస్తారు.. కానీ వర్షా కాలంలో మాత్రం దూరంగా ఉండాలని చెబుతున్నారు..వ్యాధి కారక క్రిములు వర్షాకాలంలో వ్యాపించే అవకాశం ఎక్కువ. కోడిగుడ్లలో ఉండే తేమ వల్ల వీటి వ్యాప్తికి అవి అనుకూలంగా ఉంటాయి. టైఫాయిడ్ బాక్టీరియా అయిన సాల్మొనెల్లా, ఎశ్చరీషియాకోలి ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే టైఫాయిడ్, డయేరియా వ్యాధులు వేగంగా వ్యాపిస్తుంటాయి. గుడ్లు ఫుడ్ పాయిజనింగ్ కు కారణమై కడుపు నొప్పి, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గుడ్డు వాడకపోవడమే బెటర్. తినాలనుకుంటే మాత్రం ఆమ్లెట్ గా కన్నా ఉడికించిన గుడ్డు తీసుకోవడం మంచిది..
మాములుగా వర్షాకాలంలో మటన్ షాపుల్లో తాజా మాంసం దొరకడం కష్టం. కొన్నిసార్లు చనిపోయిన కోడి మాంసాన్ని అమ్మవచ్చు. చికెన్ కొనేటప్పుడు దానిపై మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉంటే దానికి ఏదైనా వ్యాధి లేదా ఇన్ ఫెక్షన్ ఉందని అర్థం. అలాంటివి కొనొద్దు. మాంసం జిగటగా ఉండకుండా మెరుస్తూ, దృఢంగా ఉంటేనే తాజాదని భావించాలి. ఇక దాన్ని వండేటప్పుడు ముందుగా గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి… అప్పుడే వాటికి ఉన్న క్రీములు పోతాయి.. అలాగే చేపలను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.. అంటే కూరగాయలు లతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..