Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
- వేడెక్కిన మిక్సీ జార్‌తో మసాలా రుచి ఎందుకు మారుతుంది?
- ఐస్ క్యూబ్స్ ట్రిక్‌తో జార్ హీట్‌కు చెక్
- పల్స్ మోడ్ వాడకంతో మిక్సీ మోటార్‌కు లాంగ్ లైఫ్
- చిన్న జాగ్రత్తలతో మసాలాల సువాసన, రుచి డబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks : ఇంట్లో మసాలాలు రుబ్బుతున్నప్పుడు మిక్సీ జార్ తరచుగా వేడెక్కడం మనమంతా గమనించే ఉంటాం. మసాలాల గట్టిదనం, వాటి నుండి విడుదలయ్యే నూనెల వల్ల కలిగే ఘర్షణ కారణంగా జార్ త్వరగా వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల మసాలాల రుచి పాడవ్వడమే కాకుండా, మిక్సీ మోటార్, జార్ బ్లేడ్లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం కూడా గ్రైండింగ్ సమయంలో పరికరాలు వేడెక్కకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ వేడి వల్ల మసాలాల్లోని సహజమైన సుగంధ తైలాలు ఆవిరైపోయి రుచి, సువాసన తగ్గిపోతాయి. ఈ సమస్యలను నివారించడానికి కొన్ని సులభమైన వంట చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మసాలాలను పూర్తిగా చల్లబరచండి
బాగా వేయించిన మసాలా దినుసులు లేదా ఉల్లిపాయలను వేడిగా ఉన్నప్పుడే జార్లో వేసి రుబ్బితే లోపల ఆవిరి పుట్టి జార్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే గ్రైండ్ చేయడానికి ముందు వాటిని కనీసం 10-15 నిమిషాల పాటు గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు పూర్తిగా చల్లారనివ్వాలి.
Also Read
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
ఐస్ క్యూబ్స్ , చల్లటి నీటిని వాడండి
మసాలాలను పేస్ట్‌లా నూరుతున్నప్పుడు ఎల్లప్పుడూ చల్లటి నీటిని లేదా ఐస్ క్యూబ్స్‌ను ఉపయోగించండి. గోరువెచ్చని లేదా వేడి నీటిని పోస్తే జార్ ఉష్ణోగ్రత మరింత పెరిగి, లోపలి ఒత్తిడికి మూత ఎగిరిపోయే ప్రమాదం ఉంది. చల్లటి నీరు లేదా ఐస్ వాడటం వల్ల ఉష్ణోగ్రత అదుపులో ఉండటమే కాకుండా పదార్థాలు కూడా మెత్తగా నలుగుతాయి.
జాడీని నిండుగా నింపవద్దు
మిక్సీ జార్‌ను ఎప్పుడూ పైవరకు పూర్తిగా నింపకూడదు. మసాలాలు నూరడానికి, లోపల గాలి ఆడటానికి వీలుగా జార్‌ను ఎల్లప్పుడూ సగం లేదా ముప్పావు వంతు మాత్రమే నింపాలి. మీ వంటకు సరిపోయే సరైన పరిమాణం గల జార్‌ను ఎంచుకోవడం వల్ల కూడా వేడిని తగ్గించవచ్చు.
పల్స్ మోడ్ వాడకం.. చిన్న విరామాలు
మిక్సర్‌ను 10-15 నిమిషాల పాటు నిరంతరాయంగా నడపడం వల్ల జార్ , మోటార్ రెండు వేడెక్కుతాయి. అలా కాకుండా, మిక్సీని తక్కువ వేగంతో ప్రారంభించి, ఆపై వేగాన్ని పెంచాలి. నిరంతరం రన్ చేయకుండా 15 నుండి 30 సెకన్ల పాటు “పల్స్” మోడ్‌ను ఉపయోగిస్తూ, మధ్యమధ్యలో చిన్న చిన్న విరామాలు ఇస్తే జార్, బ్లేడ్లు చల్లబడతాయి.
మసాలాలు రుబ్బేటప్పుడు ఒక చేతిని మూతపై గట్టిగా ఉంచడం , గ్రైండింగ్ పూర్తయిన తర్వాత కాసేపు మిక్సీ ఆపి, మూత తెరిచి లోపలి వేడి గాలిని బయటకు పోనివ్వడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!