Healthy Hair: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో నిండిన ఉత్పత్తుల కారణంగా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, పొడిబారడం, దురద, చుండ్రు వంటి సమస్యలు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఖరీదైన షాంపూలు, చికిత్సలను ట్రై చేసిన తర్వాత కూడా, ఆశించిన ఫలితాలు రావడం లేదా. మరేం ఇబ్బంది లేదు.. ఒకసారి ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి.. ఇంతకీ దానిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Greenland: ట్రంప్‌ను సవాల్ చేస్తూ, యూరప్ ఐక్యతారాగం..
నిజానికి కొబ్బరి నూనెను శతాబ్దాలుగా జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఈ కొబ్బరి నూనెను ఒక ప్రత్యేకమైన సహజంగా లభించే ఒక పదార్ధంతో కలిపినప్పుడు, ఇది తలకు పోషణని అందించడంతో పాటు, చుండ్రును కూడా తగ్గిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుందని పేర్కొన్నారు. ఇంతకీ ఆ పదార్థం ఏమిటో, దానిని మన జుట్టుకు ఎలా ఉపయోగించాలో చూద్దామా..
కొబ్బరి నూనెలో కలిపే ఆ పదార్థం ఏమిటో తెలుసా.. కర్పూరం. ఇది జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టును పొడవుగా , మందంగా, బలంగా చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుందని, దురద, చికాకు, చుండ్రును తగ్గించడంలో విశేషంగా సహాయపడుతుందని వెల్లడించారు. అలాగే ఇది రక్త ప్రసరణను పెంచుతుందని, జుట్టు మూలాలను బలోపేతం చేస్తూ, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుందని తెలిపారు. అయితే దీనిని అప్లై చేసే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయాలని చెబుతున్నారు.
ఎలా తయారు చేయాలంటే..
కొబ్బరి నూనెతో కర్పూరం కలిపి ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. 2.5 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని, దానికి కొద్దిగా కర్పూరం (1/4 టీస్పూన్ లేదా 1 చిన్న టాబ్లెట్) వేసి కరిగించండి. అది చల్లారిన తర్వాత, దానిని మీ తలకు సున్నితంగా మసాజ్ చేయండి. 30-60 నిమిషాలు లేదా రాత్రిపూట అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి.
అలాగే కొబ్బరి నూనెతో..
ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాయడం వల్ల కూడా అనేక జుట్టు సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలు జుట్టుకు చాలా బాగా పని చేస్తుందని తెలిపారు. ఉల్లిపాయలలోని సల్ఫర్ కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది తలపై ఇన్ఫెక్షన్లు, చుండ్రును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దీనిని ఎలా తయారు చేయాలంటే..
దీన్ని తయారు చేయడానికి 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. దానికి 1-2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి తలకు మసాజ్ చేయండి. ఉల్లిపాయ రసాన్ని రాసుకుంటే, రాత్రంతా అలాగే ఉంచకండి. లేదంటే స్నానానికి గంట ముందు ఈ నూనెను రాసి, షాంపూతో తలస్నానం చేయండి.
READ ALSO: Ayatollah Ali Khamenei: ఈ ముస్లిం దేశ సుప్రీం లీడర్‌ను అమెరికా కిడ్నాప్ చేయగలదా?