Sperm Count: ప్రస్తుత జీవన శైలిలో పురుషుల అనారోగ్య సమస్యల్లో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి వీర్యకణాల (Sperm Count) తక్కువగా ఉండటం. ఇది వివాహ బంధంలో సమస్యలు తీసుక రావడం, మహిళ గర్భధారణకు ఆటంకం కలిగించడం లాంటి సమస్యలను చూపుతుంది. ఇకపోతే, వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నా.. వాటిని సహజమైన మార్గాల్లో పెంచడం చాలా సులువు. ఇందుకు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, జీవనశైలి మార్పులు ఎంతో అవసరం. మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఒకసారి చూద్దామా..
వ్యాయామం:
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది వీర్యకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. యోగా, జాగింగ్ వంటి కొద్దిపాటి వ్యాయామాలు ప్రభావం చూపుతాయి.
Read Also:Somireddy Chandramohan Reddy: పేర్ని నాని వ్యాఖ్యలపై సోమిరెడ్డి కౌంటర్ ఎటాక్.. అందుకేగా మొన్న పోటీ చేయలేదు..!

నిద్ర:
ఒక్క రోజుకు కనీసం 7–8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ లోపించి, వీర్య ఉత్పత్తిని మందగించడంలో ప్రభావితం అవుతుంది.
తప్పించాల్సిన అలవాట్లు:
వీర్యకణాల సంఖ్య, కదలిక రెండింటినీ.. ధూమపానం, మద్యం నెగటివ్ ప్రభావితం చేస్తాయి. వీటిని పూర్తిగా మానేయడం మంచిది. ఇంకా మొబైల్, ల్యాప్‌టాప్ వాడకంలో వచ్చే వేడి కారణంగా వంధ్యతకు దారితీస్తాయి. జేబులో మొబైల్, మోకాలపై ల్యాప్‌టాప్ వాడకూడదు. ఇంకా ముఖ్యంగా ఉపయోగించని స్టెరాయిడ్లు లేదా ప్రొటీన్ పౌడర్లు హార్మోన్ స్థాయులను మార్చి, వీర్య ఉత్పత్తిని తగ్గించవచ్చు.
నీరు తాగడం:
రోజుకి కనీసం 2.5–3 లీటర్ల నీరు తాగాలి. ఇలా చేయడం ద్వారా.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, శుక్లకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించండి:
స్ట్రెస్ వల్ల శుక్లకణాల ఉత్పత్తి తగ్గుతుంది. మెడిటేషన్, ప్రాణాయామం వంటి మానసిక వ్యాయామాలు శరీర హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.

Read Also:Mohammed Siraj: డిఎస్పి మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా.. అంతేకాదండోయ్..!
వైద్య సలహా:
వీర్యకణాల సమస్యలు తక్కువ సమయంలో పరిష్కారమవుతాయనే అపోహలతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉండకపోవచ్చు కాబట్టి ఆండ్రాలజిస్టు లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్టు సలహా తీసుకోవడం ఉత్తమం.
సరైన ఆహారం తీసుకోవడం:
వీర్యకణాల పెరుగుదల కోసం పోషకాహారం కీలకం. ముఖ్యంగా ఈ పోషకాలపై దృష్టి పెట్టాలి. అవేంటంటే..
జింక్ (Zinc): వీర్యకణాల ఉత్పత్తికి ముఖ్యమైన మినరల్. గోధుమలు, బాదం, గుడ్లు, కడలి, పన్నీర్ మొదలైన వాటిలో ఇది లభిస్తుంది.
విటమిన్ C, E: ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి, వీర్య నాణ్యతను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ, నారింజ, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవచ్చు.
ఓమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్: వీర్యకణాల కదలిక మెరుగుపడేందుకు చేపలు, వాల్నట్స్ వంటి ఆహారం ఉపయోగపడుతుంది.
ఫోలేట్: మల్టిగ్రెయిన్ ఆహారాలు, పాలకూరలో ఈ ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వీర్యకణాల డిఎన్‌ఏ నాణ్యతను కాపాడుతుంది.