NTV Telugu Site icon

Litchi Side Effects: లీచీ పండ్లను ఎక్కువగా తింటున్నారా?.. జాగ్రత్తగా ఉండాల్సిందే! ప్రాణాలు పోతాయ్

Litchi Fruit

Litchi Fruit

Do You Know Side Effects of Litchi: వేసవి కాలంలో అందరూ మామిడి పండ్ల మాదిరి.. లీచీ (లిచ్చి) పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్ల‌లో విట‌మిన్ సీ స‌మృద్ధిగా ఉంటుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో ల‌భిస్తుంది. లీచీ పండ్లను తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి బలపడడం, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డ‌టం, జీర్ణ‌క్రియ మెరుగుదల, గుండె జబ్బులు రాకుండా ఉండడం లాంటివి ఉన్నాయి. కానీ లీచీ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. లిచీ తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం.

లో బీపీ:
లో బీపీ సమస్య ఉంటే లీచీ పండ్లని తినకుండా ఉండాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా.. అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే లో బీపీ సమస్య ఉన్నవాళ్లు లీచీ పండ్లని తినడం మానేయాలి.

ఫుడ్ పాయిజనింగ్‌:
లీచీ పండ్లని అధికంగా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కొన్నిసార్లు కడుపు నొప్పి మరియు విరేచనాలు కూడా అవొచ్చు. కాబట్టి లీచీ వినియోగానికి దూరంగా ఉండాలి.

ఊబకాయం:
లీచీ పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య రావచ్చు. కాబట్టి లిచీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి.

Also Read: Samsung Galaxy S20 FE 5G: 75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కేవలం 28 వేలకే.. కొనడానికి ఎగబడుతున్న జనం!

అలెర్జీ సమస్య:
అలర్జీ సమస్య ఉన్నవారు లిచీలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మీకు లిచీ పడకుంటే.. అలెర్జీ సమస్య త్వరగా వస్తుంది. కాబట్టి లిచీని అధికంగా తీసుకోవడం మానుకోవాలి.

మధుమేహం:
శస్త్రచికిత్సకు ముందు 3 వారాల నుంచి లిచీలను తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల మధుమేహం వస్తుంది. దానిని నియంత్రించడం చాలా కష్టం. కాబట్టి లిచీని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంది. తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ntvtelugu.com ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు).

Also Read: Motorola Razr 40 Ultra Launch: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్.. గుడ్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్! అమెజాన్‌లో లాంచ్