NTV Telugu Site icon

Lip Care : చలికాలంలో పెదాల సంరక్షణ కోసం ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి…

Lipcare

Lipcare

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది.. అలాగే పెదవులు కూడా పగులుతాయి.. చూడటానికి అసలు బాగోవు.. అయితే చర్మంతో పెదవుల రక్షణ కూడా ముఖ్యం.. పెదాలను పగుళ్ల నుంచి బయటపడేసే అద్భుతమైన టిప్స్ మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకోండి..

శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.. ఈ సీజన్ లో లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం కంటే మంచి నాణ్యమైన లిప్ బామ్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. రోజూ లిప్ బామ్ వాడటం వల్ల పెదాలు ఎప్పటికీ పొడిబారవు. పెదవులు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. పెదవులపై చర్మం చాలా పలుచగా ఉండటం వల్ల చలికాలంలో పెదవులు త్వరగా పొడిబారిపోతాయి.. అందుకే లిప్ స్టిక్ ను ఎక్కువగా వాడటం మానెయ్యాలి.. లేదా దూరంగా ఉండటం బెస్ట్..

పెదవులపై తేనెను రెగ్యుర్‌గా అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఇది పెదవుల సహజ రంగు, మృదుత్వాన్ని కాపాడుతుంది… అలాగే ఇంట్లో తయారు చేసిన నెయ్యి, లేదా మీగడను వాడటం కూడా మంచిదే.. రాత్రి పడుకొనే ముందు పెదవులకు నెయ్యి రాసుకొని పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఎండలోకి వెళ్లేటప్పుడు పెదవులకు కొద్దిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సూర్యరశ్మికి గురికావడం వల్ల పెదవుల రంగు మారదు. ధూమపాన అలవాటును కూడా మానేయాలి.. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మీ పెదాలు అందంగా మృధువుగా ఉంటాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.