Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
- కెమికల్స్ లేకుండా దోమలను దూరం చేసే నేచురల్ హోమ్ రెమెడీ
- నిమ్మకాయ, లవంగాలతో నిమిషాల్లో తయారయ్యే దోమల నివారిణి
- అలర్జీ, అస్తమా ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా వైరల్ అవుతున్న చిట్కా
- తులసి, రోజ్మేరీ, వెనిగర్‌తో దోమలను తరిమికొట్టే మరిన్ని మార్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Remedies : సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే చాలు.. దోమల బెడద విపరీతంగా పెరిగిపోతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోదామంటే చెవి దగ్గరకు వచ్చి అవి చేసే శబ్దం నిద్రను పాడు చేయడమే కాకుండా, కుట్టి డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన రోగాలను మోసుకొస్తాయి. ఈ దోమల కాటాన్ని తట్టుకోలేక చాలామంది ఇంట్లో కాయిల్స్, లిక్విడ్లను వాడుతుంటారు. కానీ, వీటిని తయారు చేయడానికి వాడే కెమికల్స్ వల్ల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
మీకు, మీ ఇంట్లో వాళ్లకు అలర్జీ, అస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్‌ని అస్సలు వాడకూడదు. దానికి బదులుగా సోషల్ మీడియలో బాగా వైరల్ అవుతున్న “నిమ్మకాయ – లవంగాల” నైచురల్ ట్రిక్‌తో ఇంట్లోని దోమలన్నింటినీ చిటికెలో ఎలా ఓడించవచ్చో ఇప్పుడు చూద్దాం..
Also Read
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
హోమ్మేడ్ దోమల నివారిణికి కావలసిన వస్తువులు:
- నిమ్మకాయలు
- లవంగాలు
- ఒక చిన్న క్యాండిల్
- ఒక చిన్న ప్రమిద లేదా దీపం కుందు
- చిన్న చిన్న పుల్లలు (టూత్‌పిక్స్ లేదా అగ్గిపుల్లలు)
తయారీ విధానం (స్టెప్-బై-స్టెప్):
స్టెప్ 1: ముందుగా ఒక నిమ్మకాయను తీసుకుని మధ్యలోకి సమానంగా రెండు ముక్కలుగా కట్ చేయండి. అందులో ఉండే గింజలన్నింటినీ తీసేయండి.
స్టెప్ 2: ఇప్పుడు కోసిన రెండు నిమ్మకాయ ముక్కలలో.. ఒక్కో ముక్కకు చుట్టూ 6 నుండి 7 లవంగాలను గుచ్చండి.
స్టెప్ 3: ఆ తర్వాత రెండు చిన్న పుల్లలను తీసుకుని, ఒక నిమ్మకాయ ముక్కపై గుచ్చి, దానిపై రెండో నిమ్మకాయ ముక్కను బోర్లించినట్లు పెట్టాలి (రెండు ముక్కల మధ్య గ్యాప్ ఉండేలా ఒక స్టాండ్ లేదా ఫ్రేమ్ లాగా అమర్చాలి).
స్టెప్ 4: ఇలా చేయడం వల్ల రెండు నిమ్మకాయ ముక్కల మధ్యలో కొద్దిగా ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఆ మధ్యలో ఒక చిన్న క్యాండిల్ ఉంచాలి.
దీన్ని ఎలా ఉపయోగించాలి?
ఈ నిమ్మకాయ స్టాండ్ కింద పడిపోకుండా ఉండటానికి ఒక చిన్న ప్రమిద లేదా దీపంలో స్థిరంగా ఉంచండి. ఆ తర్వాత మధ్యలో పెట్టిన క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వెలుగుతున్నప్పుడు వచ్చే వేడికి నిమ్మకాయ, లవంగాలు కొద్దికొద్దిగా కాలుతూ ఒక రకమైన ఘాటైన సువాసనతో కూడిన పొగను విడుదల చేస్తాయి.
ఈ సహజసిద్ధమైన వాసన ఇంట్లోకి దోమలను అస్సలు రానివ్వదు. మీ ఇంట్లో ఎక్కువ గదులు ఉంటే, ప్రతి రూమ్‌లోనూ ఇలాంటి ఒక నిమ్మకాయ స్టాండ్‌ను ముందే తయారు చేసి పెట్టుకోవచ్చు.
దోమలను ఓడించడానికి మరికొన్ని సహజమైన చిట్కాలు:
రోజ్మేరీ మొక్క: ఇంట్లో లేదా బాల్కనీలో రోజ్మేరీ (Rosemary) మొక్కను పెంచడం వల్ల, దాని నుండి వచ్చే సువాసనకు దోమలు దూరంగా పారిపోతాయి.
తులసి మొక్క: ఇంటి గుమ్మం దగ్గర లేదా కిటికీల పక్కన తులసి మొక్కను ఉంచడం వల్ల కూడా దోమల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక స్ప్రే బాటిల్లో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ పోసి, ఇంటి మూలల్లో చల్లడం వల్ల దోమల బెడద తగ్గుతుంది.
గమనిక: ఈ సమాచారం సాధారణ గృహ నివారణల ఆధారంగా ఇవ్వబడింది. ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు వీటిని పాటించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!