Site icon NTV Telugu

Kate Daniel Weight Loss: 70 కిలోలు తగ్గిన ఇద్దరు పిల్లల తల్లి.. ఆమె పాటించిన ఐదు సూత్రాలు ఇవే…

Kate Daniel

Kate Daniel

Kate Daniel Weight Loss: అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటి చేస్తారు. అయితే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యత, ఇంటి పనిలో పడి మహిళలు తమ జీవనంపై అశ్రద్ధ వహిస్తుంటారు. దీంతో వారి శరీరం అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. దీని వలన వారి బరువు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇటీవల కేట్ డేనియల్ అనే ఇద్దరు పిల్లల తల్లి 70 కిలోలు తగ్గింది. రోజువారీ అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవడం ద్వారా బరువు ఎలా తగ్గవచ్చో ఆమె వివరించింది.

READ MORE: PM Modi AP Tour: ప్రధాని మోడీ ఏపీ టూర్‌ ఖరారు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

1. మీ శరీరాన్ని చెత్తబుట్టగా భావించకండి.

ప్రజలు తరచుగా తమ శరీరాలను చెత్తగా భావిస్తారని, నచ్చిన ఫుడ్స్ ని కడుపులోకి తోసి చెత్త కుండీలా తయారు చేస్తున్నారని కేట్ అన్నారు. కేట్ ఉద్దేశ్యం ఏమిటంటే.. బరువు తగ్గడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనే కోరిక ఉన్నా.. ఏది పడితే అవి తింటే బరువు తగ్గరు. ఆహారపు అలవాట్లు బరువు తగ్గడానికి 80% దోహదం చేస్తాయి. బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం.

2. అల్పాహారం తప్పనిసరి..

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మంది అల్పాహారం మానేస్తారు. దీంతో భోజనం చేసే టప్పుడు రెండు ముద్దలు ఎక్కువగా తింటారు. కేలరీలను సాధారణం కంటే చాలా రెట్లు పెంచుతుంది. అందువల్ల టిఫిన్ మానొద్దు. పండ్లు, ప్రోటీన్లతో సహా కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తినడానికి ప్రయత్నించాలని కేట్ డేనియల్ తెలిపింది.

3. మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి.. 

ప్రతి మహిళ రోజూ చురుకుగా ఉండాలని కేట్ చెబుతుంది. ఇందు కోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. జిమ్‌కు వెళ్లడం సాధ్యం కాకపోతే.. ఇంట్లోనే వ్యాయామాలు చేయడం, నడక లేదా యోగా చేయాలని సూచించింది.

4. మీ వాగ్దానాలను నిలబెట్టుకోండి.. 

బరువు తగ్గాలని శపథం పెట్టుకుంటారు. వ్యాయామం, ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటామని చెప్పి.. ఏదో సందర్భంలో మీ శపథాన్ని పక్కన పెడతారు. మధ్యలో ఉల్లంఘించి జంక్ ఫుడ్స్, వ్యాయామాలు మిస్ చేసుకోవడం వంటివి చేస్తారు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పు మీరు గట్టిగా శపథం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పొద్దని కేట్ డేనియల్ వివరించారు.

5. మీ ఆహారాన్ని మీరే వండుకోండి..

మీ స్వంత భోజనాన్ని మీరే తయారు చేసుకోండి.. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలని అనుకోరు. అనారోగ్యానికి కారణమయ్యే ఫుడ్స్‌కి మీరు దూరంగా ఉంటారు. ఆహారం వండుకునేటప్పుడు సైతం జాగ్రత్తగా ఉంటారు. చక్కెరను తగ్గించడం చాలా అవసరం. స్వీట్లు, కాఫీ, టీలను తగ్గించండని ఆమె స్పష్టం చేశారు.

 

Exit mobile version