Site icon NTV Telugu

Cold Fever: చలి జ్వరం వస్తే డేంజర్.. ఆ వ్యాధికి గురవుతారు..!

Pain

Pain

Cold Fever: మీకు చలి జ్వరం వచ్చినట్లైతే ఈజీగా తీసుకోకండి. ఇది UTI సంక్రమణ యొక్క లక్షణానికి దారితీస్తుంది. వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి చేరినప్పుడు, అది UTIకి దారి తీస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు ఉంటాయి. పురుషులలో UTI లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి.

BJP: బీజేపీకి దగ్గరవుతున్న పాత మిత్రులు.. ఎన్నికల్లో బీజేపీ-అకాళీదళ్ పొత్తు..?

పురుషులలో తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. పొత్తికడుపులో నొప్పి, దుర్వాసనతో కూడిన మూత్రం అంతేకాకుండా మూత్ర విసర్జనలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇవి UTI ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో చలి జ్వరం కూడా ఒక లక్షణం కావచ్చు. అయితే ఈ లక్షణాలతో కేసులు చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Ranga Maarthaanda TRP: స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్‌ను మించిన రంగమార్తాండ!

అయితే కొందరిలో ఈ వ్యాధి దానంతటదే నయమైపోతుందని, అయితే లక్షణాలు నిరంతరంగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో యూరాలజిస్ట్ లేదా నెఫ్రాలజీ వైద్యుడి వద్దకు వెళ్లండి. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ను తేలికగా తీసుకుని చికిత్స తీసుకోకపోతే కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వ్యాధికి కారణమవుతుంది. బాక్టీరియా మూత్ర నాళం ద్వారా కిడ్నీకి వెళుతుంది. ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

Exit mobile version