Ranga Maarthaanda TRP: స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్‌ను మించిన రంగమార్తాండ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Maarthaanda TRP Rating: టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని అందరూ పిలుచుకునే కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుకుంది. ఇక ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్ ను సైతం మెప్పించింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా టీవీలో ప్రసారం అయ్యింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇటీవల స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అవగా ఈ మొదటి ప్రీమియర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Varun Tej 13: VT 13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.. డిసెంబర్‌లో రిలీజ్?
Also Read
ఈ మధ్య ఓటీటీలో విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బంపర్ హిట్ అయిన సినిమాలకు, భారీ సినిమాలకు కూడా పెద్దగా రేటింగ్ రావడం లేదు. కానీ ఈ రంగమార్తాండ సినిమా మాత్రం ఏకంగా 5.85 టీఆర్పీ రేటింగ్ రాబట్టడం మామూలు విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ భార్యభర్తలుగా కనిపించగా బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, అనసూయ భరద్వాజ, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి అందించిన షాయరీ ఆకట్టుకుంది. నేనొక నటుడిని అంటూ సాగిన ఆ షాయరీ తెలుగు సినీపరిశ్రమ మరువలేని నటులందరికీ ట్రిబ్యూట్ లాంటిది.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!