NTV Telugu Site icon

Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Honey

Honey

Health Benefits of Honey: ఓ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం రెండూ చాలా చాలా ముఖ్యం. ఈ రెండు బాలెన్సుడ్‌గా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో పదార్థాలలో ‘తేనె’ కూడా ఒకటి. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే.. డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. వేసవిలో తేనెను తీసుకుంటే.. అది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి కాలంలో తేనెను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

గోరు వెచ్చని నీటిలో తేనె:
గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరంలో శక్తి వస్తుంది. దీనితో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా పనిచేస్తుంది. అందుకే రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనె కలిపిన గోరు వెచ్చని నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది.

Also Read: Maruti Upcoming Car Launch: 35కిమీ మైలేజీతో రెండు చౌకైన కార్లను విడుదల చేస్తున్న మారుతి!

నిమ్మ రసంలో తేనె:
నిమ్మ రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. నిమ్మకాయ వేసవి కాలంలో మీ శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలలో కూడా తేనె పని చేస్తుంది. నిమ్మ రసంలో తేనె కలిపి తాగితే వేసవిలో హీట్ స్ట్రోక్ రాదు. శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది.

మజ్జిగలో తేనె:
వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మీ శరీరం డీ హైడ్రేట్ కాకుండా.. చల్లగా ఉంచుకోవాలనుకుంటే తేనెతో కలిపిన మజ్జిగను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మజ్జిగ కూడా తీపిగా మారుతుంది. మజ్జిగలో తేనె కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. అంతేకాదు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

Also Read: Samsung Galaxy F54 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఆఫర్స్ డీటెయిల్స్ ఇవే!