Dark Chocolate Benefits: కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసా? రోజూ డార్క్ చాక్లేట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్, ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. చాక్లెట్‌లో ఉండే కెఫిన్ ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. డిప్రెషన్‌ను నియంత్రించడానికి డార్క్ చాక్లెట్ చాలా మంచిదని చాలా మందికి తెలుసు. అలాగే దీన్ని తీనడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం!
డార్క్ చాక్లెట్ కోకో గింజల నుండి తయారువుతుందనే విషయం చాలా మంది తెలుసు. అయితే దీనిని చాలా మంది ఓ సాధారణ చాక్లెట్‌గానే చూస్తారు. మరికొందరు చేదు ఉంటుందని అవైయిడ్ చేస్తారు. కానీ డార్క్ చాక్లెట్‌లో అనేక రకాల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వాస్తవానికి, ఇతర ఆహారాల కంటే ఎక్కువగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్‌ని ఉత్పత్తి చేయడానికి ధమనుల లైనింగ్ అయిన ఎండోథెలియంను ప్రేరేపిస్తాయి. నైట్రిక్ యాక్సైడ్ ధమనులకి రెస్ట్ తీసుకునేందుకు సిగ్నల్స్ ఇవ్వడం, రక్త ప్రవాహానికి నిరోధకతను తగ్గిస్తుంది. అందువల్ల రక్తపోటుని తగ్గిస్తుంది.

Dark Chocolate 1
అనేక అధ్యయనాలు కోకో, డార్క్ చాక్లెట్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నాయి. దానివల్ల గుండె జబ్బులు దరిచేరవు. అలాగే ఈ చాక్లెట్ ఎలివేటెడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దానివల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్, కాటెచిన్స్ ఉన్నాయి. పరిశోధన ప్రకారం, డార్క్ చాక్లెట్స్‌లోని పాలీ ఫెనాల్స్ బాదం, కోకో వంటి ఆహారాలతో కలిపినప్పుడు కొన్ని రకాల చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి.
కోకో, డార్క్ చాక్లెట్స్‌లలో బ్లూ బెర్రీస్, అకాయ్ బెర్రీస్ వంటి పండ్ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంటీ యాక్టివిటీ, పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్ ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. అదే విధంగా డార్క్ చాక్లెట్‌లో తక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఐరన్ చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే. ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ లభిస్తుంది. దీంతో రక్తహీనతను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుందట. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
Chocolate 2
సమతుల్య ఆహారంలో భాగంగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చాక్లెట్ సెల్ డ్యామేజ్‌తో పోరాడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడతాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. మధుమేహంపై కూడా చాక్లెట్ పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగు పరుస్తాయి. అలాగే, బరువు తగ్గడానికి కూడా చాక్లెట్ సహాయపడుతుందట. డార్క్ చాక్లెట్ మితమైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గుతారట. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరచడంతో కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయట.
అలాగే డార్క్ చాక్లెట్స్ రోజూ తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సాధారణంగా మార్కెట్లో డార్క్ చాక్లెట్స్ చిన్న చతురస్త్రాకారంలో దొరుకుతాయి. అవి తినొచ్చు. మార్కెట్లో ప్రతి డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి. అందులోని పదార్థాలను గమనించి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 70 శాతం అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్‌తో ఉండేవి తీసుకోవాలంటున్నారు. డార్క్ చాక్లెట్స్‌లో కూడా వివిధ రకాలు ఉంటాయి. ఎక్కువ ముదురు రంగులో ఉన్న చాక్లెట్స్‌లో తక్కువ చక్కెర ఉంటుంది. అవి మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తు్న్నారు.