No-Cook Breakfast Recipes: గ్యాస్ అవసరమే లేదు, ఈ వంటకాలను ఈజీగా చేసుకోండి..
- వంట గ్యాస్ లేదనే బాధ వద్దు..
- గ్యాస్ అవసరం లేకుండా ఈ వంటకాలు చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No-Cook Breakfast Recipes: ఇరాన్ యుద్ధం వంటింటిలో మంటలు పెడుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలను LPG గ్యాస్ భయపెడుతోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు చెబుతోంది. సంక్షోభాన్ని నివారించేందుకు కమర్షియల్ గ్యాస్‌ను తగ్గించి, సాధారణ ప్రజలకు గ్యాస్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంది.
అయితే, గ్యాస్ అవసరం లేకుండా కొన్ని ఆహారాలను సిద్ధం చేసుకోవచ్చు. మంట వెలిగించకుండానే ఈ ఈజీ రెసిపీలను తయారు చేసుకుని తినొచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తుంది. ఇప్పుడు ఆ వంటకాలు ఏంటో చూద్దాం.
Also Read
- Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
దహి-చురా:
దహి-చురా అనేది బీహార్, తూర్పు భారతదేశం నుండి వచ్చిన ఒక ప్రసిద్ధ భారతీయ అల్పాహార వంటకం. ఇందులో పెరుగు, చక్కెర లేదా బెల్లం కలిపిన అటుకులు ఉంటాయి. ఇది కడుపుకు తేలికగా ఉంటుంది, గ్యాస్ మండించకుండా నిమిషాల్లో తయారు చేయవచ్చు.
సత్తు పిండి పానీయం:
వేయించిన శనగలతో చేసే సత్తు పిండి పానీయానికి గ్యాస్ అవసరం లేదు. ఈ రెసిపీ ప్రొటీన్ కు నిలయం. ఒక గ్లాస్ నీటిలో 2-3 చెంచాట సత్తుపిండి, నల్ల ఉప్పు, వెయించిన జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపితే ఈ పానీయం రెడీ అవుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి, చల్లదనాన్ని ఇస్తుంది.
మొలకలు:
మొలకెత్తిన పెసర్లు, శనిగలు, పల్లీలతో ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. వీటిలో ఉల్లిపయాలు, టమాటోలు, కీర, నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పుకలిపితే పోషకాలు అధికంగా ఉండే సలాడ్ రెడీ అవుతుంది. దీనిని వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఫ్రూట్-పెరుగు బౌల్:
పెరుగులో అరటిపండు, ఆపిల్, బొప్పాయి ముక్కలను కలిపి తీసుకోవచ్చు. అదనపు రుచి కోసం దీనిపై తేనే లేదా డ్రైఫ్రూట్ చల్లుకుంటే అద్భుతమైన హెల్తీ బ్రేక్‌ఫాస్ రెడీ అవుతుంది.
పనీర్ సాండ్‌విచ్:
బ్రెడ్ ముక్కల మధ్య తురిమిన పనీర్, చాట్ మసాలా, పచ్చి చట్నీ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రెడ్‌ను టోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
వేయించిన నల్ల శనిగలు:
మార్కెట్‌లో దొరికే నల్ల శనిగలకు ఉప్పు, నిమ్మరసం కలిపి స్నాక్స్‌లా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి.
బొరుగుల మిశ్రమం:
మురమురాలు(బొరుగులు)తో మంచి స్నాక్ చేసుకోవచ్చు. పల్లిలు, ఉల్లిపాయాలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆవనూనె లేదా ఏదైనా నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది చేయడానికి గ్యాస్ అవసరమే లేదు.
పీనట్ బటర్ అండ్ బ్రెడ్:
మల్టీగ్రెయిన్ బ్రెడ్‌పై పీనట్ బటర్ రాసి, దానిపై రెండు అరటి ముక్కలు వేసుకుంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం.
తాజావార్తలు
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!