శీతాకాలం.. పొద్దు తక్కువ. చలి ఎక్కువ. గజగజ వణికించే వాతావరణంలో పని చేసుకోవాలంటే శరీరం సహకరించదు. అందుకే అధిక శాతం సమయం నిద్రకే కేటాయించాలనుకుంటాం. దుప్పటి ముసుగేసుకొని పడుకోవాలని, పొద్దు పొడిచే వరకు లేవకూడదని అనిపిస్తుంది. కానీ అలా చేస్తే ఎక్కడి పని అక్కడే ఉండిపోతుంది. తర్వాత హడావుడిగా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన బాడీకి ఇలాంటి లేజీ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే పోషకాహారాలను తినాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
పొద్దున్నే ఒక కప్పు ఓట్స్ తిని రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించండి. యాక్టివ్‌గా అనిపిస్తుంది. ఓట్స్‌లో ఉండే న్యూట్రియెంట్స్ కొవ్వును కరిగించటంలో ఉపయోగపడతాయి. ఇన్సులిన్ లెవల్స్ తగ్గకుండా చూస్తాయి. దీంతో ఎనర్జీ తగ్గినట్లు అనిపించదు.
రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, మినుములు, బొబ్బర్లు తదితర తృణధాన్యాలు తింటే వాతావరణానికి తగ్గట్లు మన ఒంటికి కావాల్సిన బలాన్ని ఇన్‌స్టంట్‌గా ఇస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, పీచు ఉండటం వల్ల జీవక్రియలు సాఫీగా జరుగుతాయి.
మధ్యాహ్నం లంచ్ చేశాక ఒకటీ రెండు గంటల తర్వాత గింజలను, విత్తనాలను స్నాక్స్ మాదిరిగా స్వల్పంగా తింటే అలసట అనిపించదు. ఫైబర్, విటమిన్లు తగిన మోతాదులో లభిస్తాయి. చియా సీడ్స్‌లో సైతం శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి మన శరీరంలో శక్తి తగ్గకుండా చేస్తాయి. చలి కాలంలో చలాకీగా ఉండాలంటే ఆకు కూరలు తింటే బెటర్. ముఖ్యంగా పాల కూరలో ఐరన్, విటమిన్ సీ మరియు ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి.
గుడ్డు తినటం వల్ల మన బాడీకి దాదాపు అన్ని పోషకాలు అందుతాయి. పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్-ఇ, కేలరీలు, అమనో ఆమ్లాలు లభిస్తాయి. దీంతో చురుకుగా ఉండగలం. సంతోషంగా అన్ని పనులు చక్కబెట్టుకోగలం. అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు తినటం ద్వారా మినరల్స్, విటమిన్ సి మరియు ఏ లభిస్తాయి. మనల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.