Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ullipaya Chutney: బిజీ లైఫ్‌లో రకరకాల మోడ్రన్ వంటకాలు ఎన్ని వచ్చినా.. రోట్లో నూరిన పచ్చడి రుచి ముందు అవన్నీ దిగదుడుపే. ఉదయాన్నే వేడివేడి ఇడ్లీ, దోస, లేదా మినపట్టులోకి కాస్త ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే చట్నీ నంచుకుని తింటుంటే వచ్చే తృప్తే వేరు. కేవలం ఉల్లిపాయ, చింతపండు కాంబినేషన్‌తో, ఎలాంటి టేస్టింగ్ సాల్ట్స్ లేకుండా.. ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరంగా, నోరూరించే ‘చింతపండు ఉల్లిపాయ రోటి చట్నీ’ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు: 2 పెద్దవి (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ఎండుమిర్చి: 7 నుంచి 8 (మీ కారానికి తగినట్లు)
చింతపండు: పెద్ద నిమ్మకాయ సైజంత (ముందుగానే కొద్దిగా నీటిలో నానబెట్టుకోవాలి)
జీలకర్ర: 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 4
కళ్ళుప్పు (రాతి ఉప్పు): రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారీ విధానం ..
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిరపకాయలను వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి, పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం రోట్లో వేయించిన ఎండుమిర్చి, రుచికి సరిపడా కళ్ళుప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. (మిక్సీలో కంటే రోట్లో దంచితేనే పచ్చడి వేడెక్కకుండా కమ్మటి టేస్ట్ వస్తుంది). ఎండుమిర్చి నలిగిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు (నీళ్లు లేకుండా) వేసి బాగా నూరాలి. మసాలా అంతా బాగా నలిగాక.. చివర్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను రోట్లో వేయాలి.
ఉల్లిపాయలను మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా, అక్కడక్కడా ముక్కలు తగిలేలా కచ్చాపచ్చాగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ కమ్మని తాలింపును దంచి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకుంటే.. ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే చింతపండు ఉల్లిపాయ చట్నీ రెడీ. ఈ పచ్చడి వేడివేడి ఇడ్లీ, దోస, మినపట్టులతో పాటు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు..
* ఉల్లిపాయలలో విటమిన్-సి, జింక్, వెల్లుల్లిలో ‘అల్లిసిన్’ అనే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి, సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
* చింతపండులో ఉండే టార్టారిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో వాడే జీలకర్ర, వెల్లుల్లి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా సహాయపడతాయి.
* ఉల్లిపాయల్లో ఉండే ‘ఫ్లేవనాయిడ్స్’ గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణను సాఫీగా ఉంచి, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఉల్లిపాయలు శరీరానికి సహజసిద్ధమైన చలువను అందిస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఉక్కపోతగా ఉన్నప్పుడు ఆహారంలో ఉల్లిపాయలను ఇలా చట్నీ రూపంలో తీసుకోవడం వల్ల ‘వడదెబ్బ’ తగలకుండా ఉంటుంది.
* ఎండుమిర్చిలో ఉండే ‘క్యాప్సైసిన్’ అనే సమ్మేళనం శరీరంలో అంతర్గత వాపులను, నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. అలాగే ఇది శరీరంలో మెటబాలిజాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
* బయట హోటళ్లలో దొరికే చట్నీలలో రుచి కోసం ‘అజినమోటో’ (టేస్టింగ్ సాల్ట్), ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతుంటారు. కానీ ఇంట్లోనే ఇలా సహజసిద్ధంగా రోట్లో నూరుకోవడం వల్ల ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కడుపుకు ఏ హానీ జరగకుండా హాయిగా తినవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..