ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. బాధపడుతుంటారు. పైల్స్‌ను మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. వీటినే పైల్స్ అంటారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ పైల్స్ సమస్యకు చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలోని కొన్ని ఆకులు సహాయపడతాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు చెబుతున్నారు. అవి నమిలినా, రసం చేసి తీసుకున్న పైల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
తులసి ఆకులు..
తులసి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. తులసి ఆకులు రోజూ తిన్నా, తులసి టీ రోజూ తాగినా.. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం.. లాంటి ఉదర సంబంధ సమస్యలూ తగ్గుముఖం పడతాయి. తులసిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి, వాపును తగ్గిస్తాయి.
కలబంద..
మలబద్ధకం కారణంగానూ.. పైల్స్ సమస్య ఎదురవుతుంది. కలబంద రసాన్ని తాగడం వల్ల పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. పలకవచ్చు. ఈ మొక్క బయటి భాగం ఆంత్రాక్వినోన్స్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇవి మలబద్ధకానికి ప్రకృతి ఔషధంగా ఉపయోగపడతాయి. కలబంద రసం క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పడినట్లే. తాజా కలబంద రసాన్ని.. ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే.. చికాకును తగ్గిస్తుంది. పైల్స్ నొప్పిని తగ్గిస్తుంది.
మామిడి ఆకులు..
మామిడాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది నొప్పి, అసౌక్యరం నుంచి ఉపశమనం అందించడానికి సహాయపడుతుంది. మామిడాకులు జీర్ణవ్యవస్థు మెరుగుపరుస్తాయి. మామిడాకులు నీటిలో మరగబెట్టి.. ఆ నీళ్లు చల్లారిన తర్వాత.. ఆసన ప్రాతాన్ని శుభ్రం చేసుకోండి. రోజూ ఇలా చేస్తే.. పైల్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడాకుల టీ తాగినా.. పైల్స్ సమస్యకు చెక్ పడుతుంది.
పసుపు ఆకులు..
పసుపు ఆకుల్లో.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే పసుపు ఆకులు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. తాజా పసుపు ఆకులను గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ను ఆసన ప్రాంతంలో రాయండి. మీ డైట్‌లో పసుపు, పసుపు ఆకులు చేర్చుకున్నా ఉపశమనం లభిస్తుంది.
వేపాకు..
వేప ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ గుణాలు ఉంటాయి. వీటికి శరీరంలో వాపు, అసౌకర్యాన్ని తగ్గించే సామర్థ్యం ఉంది. వేప ఆకులను నీటిలో వేసి మరగబెట్టండి. ఈ నీళ్లు చల్లారిన తర్వత.. ఆసన ప్రాంతాన్ని శుభ్రం చేసుకోండి. వేప ఆకులను రసంగా చేసి తాగినా.. ఫైల్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.