NTV Telugu Site icon

Tattoos on Body: ఒంటిపై టాటూ వేసుకుంటే యమ డేంజర్‌..?

Tattoos On Body

Tattoos On Body

Tattoos on Body: ఈ రోజుల్లో యువతకు టాటూలు వేసుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారింది. ఒకరినొకరు చూసుకుంటూ ఇష్టం వచ్చిన చోట టాటూలు వేయించుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఆధునిక కాలంలో యువత కూడా టాటూలు వేసుకుని కనిపిస్తున్నారు. పచ్చబొట్టు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందని చర్చలు జరుగుతున్నాయి. పచ్చబొట్లు క్యాన్సర్ వంటి జీవితాన్ని మార్చే వ్యాధులకు కారణమవుతాయని వాదిస్తున్నా, వాస్తవాలు గమనించాల్సి ఉంది. చర్మ క్యాన్సర్, రక్త క్యాన్సర్లు మొదలైన వివిధ క్యాన్సర్లకు టాటూలు ప్రమాద కారకంగా ముడిపడి ఉన్నాయి. 2024లో ప్రచురించబడిన స్వీడిష్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ నుండి 11,905 మంది పాల్గొనేవారి జనాభా-ఆధారిత అధ్యయనం పచ్చబొట్లు ఉన్నవారిలో లింఫోమా సంభవం 21% పెరిగిందని వెల్లడించింది. టాటూ ఎక్స్‌పోజర్‌తో సంబంధం ఉన్న లింఫోమా రకం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది.

లింఫోమా అనేది శోషరస వ్యవస్థలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. టాటూ వేయించుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే చర్మంలోని రోగనిరోధక కణాలు టాటూ ఇంక్‌లోని రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి. సిరా శరీర కణాల్లోకి వెళ్లి వాపుకు దారితీస్తుందని కొందరు వైద్య నిపుణలు వెల్లడించారు. ఈ సిరాల్లో కొన్ని లోహాలు ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ద్వారా టాటూ ఇంక్‌లోని కొన్ని రసాయనాలను క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఏదీ ఏమైనా కొందరు టాటూ వేయించుకుంటే క్యాన్సర్‌ కు దారిస్తుంది అంటుంటే మరి కొందరు లేదని పేర్కొన్నారు. ఏదైమన టాటూలు వేయించుకోవడం ఎప్పటికైనా రిస్కే అనేది మాత్రం అక్షర సత్యం. అందుకే యువత టాటూలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు కోరుతున్నారు.
Income Tax: ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి తేదీని పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ!

Show comments