Site icon NTV Telugu

Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్‌ఫెక్షన్‌ కారకం…!

Urine

Urine

మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య. కానీ అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదట. ఇది కొన్నిసార్లు ఓ వ్యాధికి సంకేతం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? ఏ వ్యాధులు దానికి కారణమవుతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..

READ MORE: RCB’s IPL Playoff Record: తొమ్మిదేళ్ల తర్వాత టాప్‌-2లోకి ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌లో ఆ జట్టు రికార్డులు ఇవే..?

మూత్ర విసర్జన సమయంలో.. ముఖ్యంగా బలంగా పోస్తున్నప్పుడు నురగ రావటం మామూలే. దీనికి భయపడాల్సిన పనిలేదు. కానీ అదే పనిగా నురగ వస్తున్నా, చెడు వాసన కొడుతున్నా మూత్రకోశ ఇన్‌ఫెక్షన్, మూత్రంలో సుద్ద (ప్రొటీన్‌/అల్బుమిన్‌) పోవటానికి సంకేతం కావొచ్చు. మీకు ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయో లేవో తెలపలేదు. సాధారణంగా కిడ్నీ సరిగా పనిచేయకపోవటం, మధుమేహం మూలంగా కిడ్నీ దెబ్బతినటం వల్ల మూత్రంలో సుద్ద పడుతుంది. కాబట్టి ముందు మీరు మూత్ర పరీక్ష చేయించుకోండి.

READ MORE: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్

ఇందులో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, సుద్ద పోతున్నా బయటపడుతుంది. అలాగే కిడ్నీ పనితీరును తెలుసుకోవటానికి రక్తంలో క్రియాటినిన్‌ పరీక్ష కూడా అవసరమే. ఇవి రెండూ నార్మల్‌గా ఉంటే ఇబ్బందేమీ లేదనుకోవచ్చు. అంటే కిడ్నీ పనితీరు బాగుండి, మూత్రంలో సుద్ద లేకపోతే నురగ వస్తున్నా బాధపడాల్సిన పనిలేదన్న మాట. ఒకవేళ మూత్ర, రక్త పరీక్షల ఫలితాలు నార్మల్‌గా లేకపోతే మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో కిడ్నీ దెబ్బతింటుంది. గ్లోమరులర్‌ నెఫ్రయిటిస్‌తోనూ మూత్రంలో సుద్ద పడొచ్చు. ఇలాంటి సమస్యలున్నట్టు తేలితే తగు చికిత్స తీసుకోవాలి. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టయితే యాంటీబయాటిక్‌ మందులు వాడుకోవాలి.

Exit mobile version