Stroke Death Risk Using Single X-Ray: భవిష్యత్తులో ఒక్క ఎక్స్-రేతోనే గుండె జబ్బులను అంచనా వేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో గుండె స్ట్రోక్ డెత్ రేట్ రిస్క్ ను అంచానా వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మరణిస్తున్న వారిలో గుండె జబ్బులే కారణం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధులతో ప్రతీ సంవత్సరం 1.19 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధులు నివారణకు పరిశోధకులు కొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు.
కేవలం ఒకే ఛాతీ ఎక్స్-రే ఉపయోగించి అథెరోస్కెలోరోటిక్ హృదయ సంబంధ వ్యాధులను, గుండె సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే మరణాలను అంచానా వేయవచ్చు. 10 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ను కనుక్కునేందుకు నమూనాను అభివృద్ధి చేశారు. బీఆర్జీ.కామ్ ప్రకారం.. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని CXR-CVD రిస్క్ అని పిలుస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ క్యాన్సర్ ఇన్సిట్యూట్ దీన్ని రూపొందించింది. డీప్ లర్నింగ్ అనేది ఒక కొత్త ఏఐ ఉపయోగించి ఈ టెక్నాలజీని రూపొందించారు.
Read Also: Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెడిసిన్స్‌పై బార్‌కోడ్ తప్పనిసరి
సాధారణంగా ఒక రెేడియాలజిస్ట్ ఒక వ్యక్తి ఛాతీ చిత్రాలను తీసుకున్నప్పుడు.. గుండె, ఉపిరితిత్తులలోని ప్రాంతంలోని ఇతర అవయవాలను కూడా చూస్తారు. ఒకవేళ గుండె సైజు పెద్దదిగా ఉంటే ఏదో సమస్య ఉందని గ్రహించే అవకాశం ఉంటుంది. బృహద్దమని కూడా చూడవచ్చు. అది ఎన్ లార్జ్ అయి ఉన్నా, కాల్షియం పేరుకుపోయి ఉన్నా తెలిసిపోతుంది. ఉపరితిత్తుల్లో నీరు చేరడం, దాని కణజాలాన్ని చూడవచ్చు. గుండె వైఫల్యానికి సంబంధించిన లక్షణాలను గమనించవచ్చు.
ఈ కొత్త టెక్నాలజీలో అథెరోస్కెలోరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ (ASCVD) రిస్క్ స్కోర్ ఉపయోగించి గుండెకు సంబంధించిన వ్యాధులను కనుక్కొవచ్చు. వయస్సు, జాతి, రక్తపోటు, ధూమపానం, టైప్ 2 డయాబెటిస్ ఇలా అన్నింటిని పరిగణలోకి తీసుకుని గుండె వ్యాధుల రిస్క్ ను లెక్కిస్తుంది. స్కోర్ 7.5 శాతం లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న, 10 ఏళ్లలో గుండెసంబంధిత వ్యాధుల ప్రమాదం ఉన్న వారికి వాటిని అడ్దుకునేందుకు మందులను సిఫారసు చేయనున్నారు.