NTV Telugu Site icon

Health Tips: ఈ పంచ సుగంధ ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకుంటే.. ఆ వ్యాధులన్నీ దూరం

Spicess

Spicess

పూర్వ కాలం నుంచి సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేని వంటిల్లు అసంపూర్ణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. ఇవి దేనికదే ప్రత్యేకమైన రంగు, వాసన కలిగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు, కొత్తిమీర, యాలకులు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పంచ సుగంధ ద్రవ్యాలను మీ ఆహారంలో చేర్చుకుంటే ఆ వ్యాధులన్నీ దూరం అవుతాయంటున్నారు నిపుణులు.

Also Read:Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి

పసుపు:

పసుపును ఆహారంలో చేర్చుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ధనియాలు:

ధనియాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొత్తిమీర గింజలైన ధనియాలలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దోహదపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, మధుమేహాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Also Read:Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి

జీలకర్ర:

మరో సుగంధ ద్రవ్యం జీలకర్ర. వంటల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. జీలకర్ర పొడిని సలాడ్స్, పానియాల్లో కలుపుకుని తీసుకువచ్చు. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్లం:

అల్లం లేకుండా వంటకాలను ఊహించలేము. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా హెల్తీగా చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కీళ్లు, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

Also Read:Mazaka : సినిమా వాళ్లా ‘మజాకా’ .. పగలే చుక్కలు!

యాలకులు:

రోజువారీ ఆహారంలో యాలకులను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదంటున్నారు నిపుణులు. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో, ఇతర వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఆహారానికి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలను దరిచేరనీయదు.