Health Tips: ఈ పంచ సుగంధ ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకుంటే.. ఆ వ్యాధులన్నీ దూరం
- సుగంధ ద్రవ్యాలను ఆహారంలో చేర్చుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
- ఆయుర్వేదంలో వీటిని ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు
- సుగంధ ద్రవ్యాలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూర్వ కాలం నుంచి సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేని వంటిల్లు అసంపూర్ణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. ఇవి దేనికదే ప్రత్యేకమైన రంగు, వాసన కలిగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు, కొత్తిమీర, యాలకులు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పంచ సుగంధ ద్రవ్యాలను మీ ఆహారంలో చేర్చుకుంటే ఆ వ్యాధులన్నీ దూరం అవుతాయంటున్నారు నిపుణులు.
Also Read:Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
Also Read
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
పసుపు:
పసుపును ఆహారంలో చేర్చుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ధనియాలు:
ధనియాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొత్తిమీర గింజలైన ధనియాలలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దోహదపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, మధుమేహాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
Also Read:Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
జీలకర్ర:
మరో సుగంధ ద్రవ్యం జీలకర్ర. వంటల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. జీలకర్ర పొడిని సలాడ్స్, పానియాల్లో కలుపుకుని తీసుకువచ్చు. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం:
అల్లం లేకుండా వంటకాలను ఊహించలేము. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా హెల్తీగా చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కీళ్లు, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
Also Read:Mazaka : సినిమా వాళ్లా ‘మజాకా’ .. పగలే చుక్కలు!
యాలకులు:
రోజువారీ ఆహారంలో యాలకులను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదంటున్నారు నిపుణులు. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో, ఇతర వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఆహారానికి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలను దరిచేరనీయదు.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?