NTV Telugu Site icon

Memory: జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని నియమాలు..తప్పక పాటించండి..

Memory

Memory

మీకు ఈ మధ్య మీకు ఏ విషయం గుర్తుండటం లేదా? జ్ఞాపకశక్తి మునుపటిలా కాకుండా తగ్గిపోయిందని భావిస్తున్నారా? అయితే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. జ్ఞాపకశక్తి మందగించడం అనేది తేలికగా తీసుకోకూడని సమస్య, ఇది మెదడు పనితీరుతో ముడిపడి ఉంటుంది. జ్ఞాపకశక్తి అనేది మన మెదడులో సమాచారాన్ని నిల్వచేసి, అవసరమైనపుడు తిరిగి గుర్తు చేసే ఒక ప్రక్రియ. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ నియమాలు పాటించండి..

READ MORE: Charmi Kaur: డబుల్ ఇస్మార్ట్ కే పోటీ వస్తారా? రవితేజ, హరీష్ శంకర్లకు ఛార్మి షాక్?

జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పులు..
అన్ని రకాల పోషకాలు ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్ తింటే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే మైండ్ షార్ప్‌గా పనిచేస్తుంది. తాజా పండ్లు, నట్స్, సీడ్స్ కూడా డైట్‌లో ఉండాలి. వీటితో పాటు జీవన శైలిలో మార్పు తప్పని సరి. రోజూ సమయానికి ఆహారం తీసుకోవాలని.. తగినంత నిద్ర తప్పక అవసరం. నిద్రలేమితో బాధపడే వారికి జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చని అధ్యయనాల్లో కనుగొన్నారు. అందుకే రోజూ కనీసం 6-8 గంటలు నిద్ర పోవాలి.

READ MORE: Cars in August: మహీంద్రా థార్ 5-డోర్‌తో సహా ఆగస్టులో రాబోతున్న కార్లు ఇవే..

ఒంటరితనం మంచిది కాదు..
ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా నలుగురిలో కలవండి. ఎందుకంటే ఒంటరి తనం చాలా ప్రమాదం. సోషల్ ఇంటరాక్షన్స్ కారణంగా ఒత్తిడి, డిప్రెషన్స్‌ దూరం అవుతాయి. ఈ రెండూ జ్ఞాపకశక్తిని దెబ్బతీసే మానసిక సమస్యలు. అందుకే ఇష్టమైన వ్యక్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మంచిది.

READ MORE:Payal Radhakrishna: హే పాయల్ పాపా నువ్ కూడా ఇలా జాకెట్ లేకుండా ఫోజులిస్తే ఎలా?

రోజూ ఏదో ఒక పని చేస్తుండాలి…
రోజూ ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. అప్పుడే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. శారీరక శ్రమ కారణంగా మెదడుకు రక్త ప్రవాహం సరిగా ఉంటుంది. దీంతో కొత్త బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి. జుంబా, ఏరోబిక్స్, స్విమ్మింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు మెదడు పనితీరును చాలా ఇంప్రూవ్ చేస్తాయి. క్రమంగా ఎక్సర్‌సైజ్ ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు.

READ MORE:Paris Olympics: ఒలింపిక్స్ వేడుకలో పెద్ద తప్పిదం..క్షమాపణలు చెప్పిన నిర్వహణ కమిటీ

ఛాలెంజింగ్ తత్వం..
మీ బ్రెయిన్‌ యాక్టివ్‌గా ఉండాలంటే, దానికి ఛాలెంజ్ విసిరే పనులు చేయాలి. పజిల్స్, సుడోకు, ఆప్టికల్ ఇల్యూషన్స్, క్రాస్‌వర్డ్ పజిల్స్, పిక్చర్ పజిల్స్ వంటివి సాల్వ్ చేస్తూ ఉండాలి. కొత్త భాషలు నేర్చుకోవాలి. మైండ్‌ను పూర్తిగా ఇన్వాల్వ్ చేసే ఇలాంటి యాక్టివిటీస్, జ్ఞాపకశక్తిని ఇంప్రూవ్ చేస్తాయి.