Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Semiya Puttu: ఈరోజుల్లో చాలా మంది పిల్లలు వారికి ఆకలి వేయగానే పాకింగ్ ఫుడ్స్ వైపు చూస్తున్నారు. సాధారణంగా చాలా మంది పిల్లలు సాయంత్రం అవ్వగానే కురుకురేలు, చిప్స్, లేదా నూడుల్స్ కోసం మారాం చేస్తుంటారు. మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ పెట్టి వారి ఆరోగ్యాన్ని పాడుచేసే కంటే.. కేవలం 10 నిమిషాల్లో ఆవిరిపై ఉడికించి చేసే ఒక అమృతం లాంటి స్నాక్ వారికి చేసి ఇస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, స్నాక్ తిన్న ఫీలింగ్ పిల్లలకు కలుగుతుంది. ఇంతకీ ఆ స్నాక్ పేరు ఏంటో తెలుసా.. అదే ‘రాగి సేమియా పుట్టు’ (Ragi Semiya Puttu). సాంప్రదాయ కేరళ స్టైల్ పుట్టుకు.. మన రాగుల పోషకాలను జోడించి చేసే ఈ స్నాక్ టేస్ట్‌లో నెక్స్ట్ లెవెల్ అంతే. చుక్క నూనె కూడా లేకుండా, ఐరన్ – క్యాల్షియం దట్టించి చేసే ఈ హెల్తీ రెసిపీని వారంలో ఒక్కసారైనా తింటే రక్తహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు మాయమవ్వడం ఖాయం అని చెబుతున్నారు. మరి నోరూరించే ఈ ఇన్స్టెంట్ రాగి పుట్టును ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
రాగి సేమియా
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
అటుకులు
తురిమిన పచ్చి కొబ్బరి
బెల్లం పొడి
నీరు
తయారీ విధానం ఇదే..
ముందుగా రాగి సేమియాను ఒక పాత్రలోకి తీసుకుని, తగినన్ని నీరు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, ఆ సేమియాను ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్లో ఉంచి ఆవిరిపై బాగా ఉడికించుకోవాలి. ఇదే సమయంలో కొద్దిగా అటుకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రంగా కడిగి, కాసేపు పక్కన పెట్టుకుని తర్వత వడకట్టుకోవాలి. తర్వాత బాగా ఉడికిన రాగి సేమియాను ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. అందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులు, తాజా తురిమిన పచ్చి కొబ్బరి, తీపికి సరిపడా బెల్లం పొడిని వేయాలి. వీటన్నింటినీ చెంచాతో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, హెల్తీ రాగి సేమియా స్నాక్ రెడీ అవుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
రాగులలో అన్ని రకాల తృణధాన్యాల కంటే అత్యధికంగా కాల్షియం లభిస్తుంది. ఇది పిల్లల ఎదుగుదలకు, ఎముకల పుష్టికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వయసు పైబడిన వారిలో వచ్చే కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ రెసిపీలో రాగులతో పాటు ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ రెండింటి కాంబినేషన్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని వేగంగా పెంచుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గి, అలసట లేకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. రాగులలో ఉండే అమినో యాసిడ్స్, ఐరన్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. వారంలో కనీసం రెండు సార్లు ఈ స్నాక్ తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.
ఇందులో చుక్క నూనె కూడా వాడకుండా కేవలం ఆవిరిపై మాత్రమే ఉడికిస్తాం. పైగా రాగులలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ. ఇది తిన్న తర్వాత పొట్ట నిండిన అనుభూతిని ఇస్తుంది. త్వరగా ఆకలి వేయనివ్వదు, దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఈవెనింగ్ స్నాక్‌గా పని చేస్తుంది చెబుతున్నారు. ఆవిరిపై ఉడికించిన ఆహారం కావడం వల్ల, ఇందులో వాడిన అటుకులు, కొబ్బరి వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచి ఆహారంగా పని చేస్తుంది. రాగులలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా అదుపులో ఉంచుతుంది. షుగర్ ఉన్నవారు బెల్లానికి బదులు కొద్దిగా తక్కువ మోతాదులో బ్రౌన్ షుగర్ లేదా కేవలం కొబ్బరితో దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మైదాతో చేసే నూడుల్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ.. కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ రాగి సేమియా పుట్టును మీ డైట్లో చేర్చుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!