Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Halwa: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎముకల బలానికి, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి రాగులను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రతిరోజూ రాగి జావ లేదా రాగి సంకటి తిని బోర్ కొట్టిన వారికి ఒక అద్భుతమైన హెల్దీ ఆప్షన్ అందుబాటులోకి ఉంది. రాగి పిండితో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే హెల్దీ హల్వాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దీని టేస్ట్ చూస్తే చిన్న పిల్లలు సైతం ప్లేట్లు ఖాళీ చేయడం ఖాయం…
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – 1 కప్పు
Also Read
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
బెల్లం తురుము (లేదా చక్కెర) – 1న్నర కప్పు
నీళ్లు – 2 నుంచి 3 కప్పులు
నెయ్యి – అర కప్పు
యాలకుల పొడి – 1 స్పూన్
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం ముక్కలు) – తగినన్ని
తయారు చేసే విధానం ఇదే..
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోస్తూ ఎలాంటి ఉండలు లేకుండా పల్చటి మజ్జిగలాగా బాగా కలుపుకోవాలి. మరో పాత్రలో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. దీనికి ముదురు పాకం రానవసరం లేదు, బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీటిని ఒకసారి వడకట్టుకుంటే అందులో ఉండే నలకలు తొలగిపోతాయి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి లేదా నాన్-స్టిక్ పాన్ తీసుకుని అందులో ముందుగా రెడీ చేసుకున్న రాగి పిండి మిశ్రమాన్ని పోయాలి. స్టవ్‌ను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, చెంచాతో అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. రాగి పిండి చాలా త్వరగా చిక్కబడుతుంది.
ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడ్డాక, వడకట్టుకున్న బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలుపుకోవాలి. రాగి పిండి బెల్లం నీటిని పీల్చుకుని గ్లోసీగా (మెరుస్తూ) మారుతుంది. ఈ సమయంలో రెండు లేదా మూడు విడతలుగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. హల్వా పాత్రకు అంటుకోకుండా విడిపోయేంత వరకు ఉడికించాలి. ఈ హల్వా బాగా దగ్గర పడి, నెయ్యి పైకి తేలుతున్న సమయంలో యాలకుల పొడి – నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కలను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, నోట్లో వేస్తే కరిగిపోయే రాగి పిండి హల్వా రెడీ అయిపోతుంది. దీనిని ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి అందులో వేసి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాగులలో ఇతర తృణధాన్యాల కంటే అత్యధికంగా క్యాల్షియం ఉంటుంది. మహిళల్లో ముప్పై ఏళ్లు దాటిన తర్వాత వచ్చే ఎముకల అరుగుదల నివారించడానికి, పెరిగే పిల్లల్లో ఎముకలు బలంగా తయారవ్వడానికి ఈ రాగి హల్వా ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగి పిండి – బెల్లం.. ఈ రెండింటిలోనూ ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనతతో బాధపడే మహిళలకు ఇది తక్షణ శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో చక్కెర బదులు బెల్లం వాడటం వల్ల, స్వీట్ తినాలనుకునే డయాబెటిక్ రోగులకు ఇది ఇతర మైదా స్వీట్ల కంటే చాలా ఉత్తమమైన ఆప్షన్ అని చెబుతున్నారు.
రాగుల్లో ఉండే ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మంపై ముడతలు రాకుండా కాపాడతాయి. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నీరసాన్ని తగ్గించడానికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. రాగులలో ఉండే అమినో యాసిడ్లు సహజ సిద్ధమైన రిలాక్సెంట్లుగా పనిచేస్తాయి. ఇది మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!