Midnight Scrolling: అర్ధరాత్రి మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీరు ఈ వ్యాధి బారినపడే అవకాశం..
- అర్ధరాత్రి ఫోన్ వాడటం ఆరోగ్యానికి హానికరం..
- డయాబెటిస్ వచ్చే ఛాన్స్..
- జీవక్రియను దెబ్బతీసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Midnight Scrolling: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగింది. నిద్ర పోయేటప్పుడు, నిద్ర నుంచి మేల్కొవడం ఫోన్లతోనే మొదలవుతోంది. ఇలా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుందని, నిద్ర వ్యవధిని బట్టి డయాబెటిస్(షుగర్) వచ్చే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి కృత్రిమ కాంతికి గురికావడం, అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని తేలింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 40 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 85,000 మందిని తొమ్మిదేళ్ల పాటు పరిశీలించారు. చేతి మణికట్టుకు ఒక పరికరాన్ని అమర్చి వారు కాంతికి గురువున్న సమయాన్ని ట్రాక్ చేశారు.
Also Read
- Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
- Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
- Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
- Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
Read Also: Nigeria wedding: పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడిలో 32 మంది దుర్మరణం
రాత్రిపూట కాంతికి గురికావడం మరియు టైప్ -2 డయాబెటిస్‌కి మధ్య సంబంధాన్ని అధ్యయనంలో కనుగొన్నారు. రాత్రిపూట మొబైల్ కాంతికి గురవుతున్న టాప్ 10 శాతంలో 67 శాతం మందికి మిగతా వారితో పోలిస్తే ఎక్కువగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. నిద్ర వ్యవధి, మొత్తం ఆరోగ్య అలవాట్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వీటి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రభావాన్ని రుజువు చేయనప్పటికీ కృత్రిమ కాంతి శరీర సహజ నిద్ర మేల్కొనే చక్రానికి అంతరాయాన్ని కలిగిస్తోందని, ఇది జీవక్రియ సమస్యలకు దారి తీయవచ్చని సూచిస్తోంది. స్మార్ట్ఫోన్లు, టీవల నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతోంది. రాత్రిపూట కాంతి మరియు మధుమేహం మధ్య సంబంధాన్ని పటిష్టం చేయడానికి భవిష్యత్తు అధ్యయనాలు అవసరమవుతాయని పరిశోధకులు చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!