NTV Telugu Site icon

Midnight Scrolling: అర్ధరాత్రి మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీరు ఈ వ్యాధి బారినపడే అవకాశం..

Midnight Scrolling

Midnight Scrolling

Midnight Scrolling: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగింది. నిద్ర పోయేటప్పుడు, నిద్ర నుంచి మేల్కొవడం ఫోన్లతోనే మొదలవుతోంది. ఇలా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కాంతికి ఎక్స్‌పోజ్ కావడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుందని, నిద్ర వ్యవధిని బట్టి డయాబెటిస్(షుగర్) వచ్చే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

రాత్రిపూట, ముఖ్యంగా అర్ధరాత్రి కృత్రిమ కాంతికి గురికావడం, అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని తేలింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 40 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 85,000 మందిని తొమ్మిదేళ్ల పాటు పరిశీలించారు. చేతి మణికట్టుకు ఒక పరికరాన్ని అమర్చి వారు కాంతికి గురువున్న సమయాన్ని ట్రాక్ చేశారు.

Read Also: Nigeria wedding: పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడిలో 32 మంది దుర్మరణం

రాత్రిపూట కాంతికి గురికావడం మరియు టైప్ -2 డయాబెటిస్‌కి మధ్య సంబంధాన్ని అధ్యయనంలో కనుగొన్నారు. రాత్రిపూట మొబైల్ కాంతికి గురవుతున్న టాప్ 10 శాతంలో 67 శాతం మందికి మిగతా వారితో పోలిస్తే ఎక్కువగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. నిద్ర వ్యవధి, మొత్తం ఆరోగ్య అలవాట్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వీటి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రభావాన్ని రుజువు చేయనప్పటికీ కృత్రిమ కాంతి శరీర సహజ నిద్ర మేల్కొనే చక్రానికి అంతరాయాన్ని కలిగిస్తోందని, ఇది జీవక్రియ సమస్యలకు దారి తీయవచ్చని సూచిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, టీవల నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతోంది. రాత్రిపూట కాంతి మరియు మధుమేహం మధ్య సంబంధాన్ని పటిష్టం చేయడానికి భవిష్యత్తు అధ్యయనాలు అవసరమవుతాయని పరిశోధకులు చెప్పారు.