NTV Telugu Site icon

Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్‌ ఖరీదు లక్షా పాతిక వేలు

Key Treatment For Knee Problems

Key Treatment For Knee Problems

Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్‌ ది సెల్ఫ్‌’ సెల్ థెరపీ ట్రీట్మెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్‌కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్‌ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది. ఆల్కెమ్‌ ల్యాబొరేటరీస్‌ మరియు స్టెప్యుటిక్స్‌ అనే బెంగళూరు బయోటెక్నాలజీ కంపెనీ సంయుక్తంగా ఈ సెల్‌ థెరపీని అందుబాటులోకి తెస్తున్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్యకు పరిష్కారంగా అందించే ఈ ట్రీట్మెంట్‌ని స్టెమ్‌వన్‌గా పేర్కొంటారు.

23న ‘గ్రామీణ’ సమ్మె

గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆలిండియా గ్రామీణ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నెల 23వ తేదీన అంటే శుక్రవారం రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ గ్రామీణ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మరియు తెలంగాణ గ్రామీణ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కరీంనగర్‌ రీజియన్‌ సమావేశం నిర్వహించాయి. గ్రామీణ్‌ బ్యాంక్‌లకి దేశవ్యాప్తంగా 23 వేల బ్రాంచ్‌లు, 80 వేల మంది ఉద్యోగులు, 10 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉందని సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Bigg boss 6: వెళుతోంది అత్తారింటికి కాదన్న అభినయశ్రీ!

త్వరలో ‘పర్యాటక విధానం’

2023 బడ్జెట్‌ లోపే జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిన్న ప్రారంభమైన మూడు రోజుల రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. టూరిజం సెక్టార్‌ని ఓవరాల్‌గా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్‌ని ఏర్పాటుచేశారు. పర్యాటక రంగం అభివృద్ధికి, పురోగతికి అమలుచేయాల్సిన పథకాలను, విధానాలను, చేపట్టాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ మేరకు తాము చేపట్టిన విజయవంతమైన ప్రాజెక్టులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెల్లడిస్తున్నాయి.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

ఇవాళ ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. మొదట నష్టాల్లో, ప్రస్తుతం లాభాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 341 పాయింట్లు పెరిగి 59181పైనే కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 17581 వద్ద ఉన్న ఉంది. ‘భారత్‌ డైనమిక్స్‌’ స్టాక్స్‌ 6 శాతం ర్యాలీ తీస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.59 పలుకుతోంది.