Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Natural Sunscreen: వేసవి కాలంలో మండుటెండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం.. ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మం నల్లబడటం, ఎండదెబ్బ తగలడం, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మార్కెట్లో లభించే సన్స్క్రీన్లు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటిలోని రసాయనాలు ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోవు. పైగా అవి ఖరీదైనవిగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సహజ పదార్థాలతో సన్‌స్క్రీన్ తయారు చేసుకోవడం మంచి ప్రత్యామ్నాయం.
ప్రస్తుతం కాలుష్యం పెరగడం వల్ల ఓజోన్ పొర బలహీనపడుతూ, సూర్యుని హానికర UV కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. అందువల్ల చర్మాన్ని రక్షించుకోవడం కోసం సన్‌స్క్రీన్ తప్పనిసరి అయింది. మీ వంటగదిలోనే లభించే పదార్థాలతో సులభంగా, తక్కువ ఖర్చుతో సహజ సన్స్క్రీన్లను తయారు చేసుకోవచ్చు.
Also Read
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- AMH తక్కువగా ఉంటే IVF తప్పనిసరా? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు...
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
* కలబంద మరియు కొబ్బరి నూనెతో సన్‌స్క్రీన్: కలబంద చర్మాన్ని చల్లబరుస్తుంది, కొబ్బరి నూనె తేలికపాటి సహజ రక్షణను ఇస్తుంది. రెండు టీస్పూన్ల కలబంద జెల్‌కు అర కప్పు కొబ్బరి నూనెతో పాటు కొద్దిగా వాల్నట్ నూనె కలిపి బాగా మిక్స్ చేస్తే, ఇది చర్మాన్ని తేమగా ఉంచుతూ ఎండ నుండి రక్షిస్తుంది.
* నువ్వుల నూనెతో సన్‌స్క్రీన్ స్ప్రే: నువ్వుల నూనెకు సూర్యరశ్మిని గ్రహించే లక్షణం ఉంది. నువ్వుల నూనెను రోజ్ వాటర్‌తో సమానంగా కలిపి స్ప్రే బాటిల్లో వేసుకుని ఉపయోగిస్తే, ఇది తేలికగా ఉండి చర్మంపై జిగటగా ఉండదు.
* షియా బటర్ మరియు జింక్ ఆక్సైడ్ మిశ్రమం: చిక్కటి సన్‌స్క్రీన్ కావాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. కొద్దిగా షియా బటర్‌ను వేడి చేసి, అందులో నాన్-నానో జింక్ ఆక్సైడ్ కలిపితే UV కిరణాల నుంచి రక్షణ కలిగించే పొర ఏర్పడుతుంది. అయితే, దీనిని తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
* గ్రీన్ టీ సన్ ప్రొటెక్షన్ స్ప్రే: గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అర కప్పు నీటిలో గ్రీన్ టీ మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత కొద్దిగా విటమిన్ E నూనె కలిపి స్ప్రేగా ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి బాగా సరిపోతుంది.
* బాదం నూనె మరియు తేనె మైనంతో సన్‌స్క్రీన్: నీటితో లేదా చెమటతో త్వరగా పోని సన్‌స్క్రీన్ కోసం తేనె మైనాన్ని కరిగించి, బాదం నూనెతో కలిపి చల్లారనివ్వాలి. ఇది చర్మంపై ఎక్కువసేపు నిలిచి నీటి నిరోధక రక్షణను ఇస్తుంది.
అయితే, ఇంట్లో తయారుచేసే సన్స్క్రీన్లు సహజమైనవి అయినప్పటికీ, వాటి SPF స్థాయిని ఖచ్చితంగా తెలియజేయడం కష్టం. కాబట్టి తీవ్ర ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే కొత్తగా ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం ఎంతో ముఖ్యమైనది.. మొత్తంగా ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే సహజ సన్‌స్క్రీన్‌లతో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.. కానీ, ఉపయోగించే ముందు.. ఓ సారి టెస్ట్ చేసుకోవడం బెటర్..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..