Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Homemade Beetroot Face Masks For Natural Pink Glow Easy Diy Skincare Tips

Beetroot Face Mask: మీ ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.. హోం మేడ్ బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌ ట్రై చేయండి..

Published Date :February 11, 2026 , 4:54 pm
By Sudhakar Ravula
Beetroot Face Mask: మీ ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.. హోం మేడ్ బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌ ట్రై చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Beetroot Face Mask: అందమైన, ఆకట్టుకునే ముఖం ఉండాలని ఎవరు కోరుకోరు.. అంతేకాదు.. అందమైన, మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా పార్లర్ ట్రీట్‌మెంట్స్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.. అయితే, డబ్బులు భారీగా ఖర్చు చేసే అవసరం లేకుండానే.. మన వంటగదిలోనే లభించే సహజ పదార్థాలతో చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. వాటిలో బీట్‌రూట్ ఒక ముఖ్యమైన పదార్థం. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి సహజమైన గులాబీ కాంతిని అందించడంలో సహాయపడతాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే 4 బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌లు ఇవి.

1. బీట్‌రూట్ – క్యారెట్ ఫేస్ మాస్క్
బీట్‌రూట్ మరియు క్యారెట్ రసం చర్మాన్ని చల్లబరుస్తూ సహజ కాంతిని ఇస్తాయి… బీట్‌రూట్ రసం, క్యారెట్ రసం సమాన మోతాదులో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేసి తయారు చేసుకోవచ్చు.. ఆ తర్వాత ప్రతి ఉదయం ఒక ఐస్ క్యూబ్‌ను ముఖంపై సున్నితంగా రుద్దాలి. 10–15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.

2. బీట్‌రూట్ – పెరుగు ఫేస్ మాస్క్
ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తుంది. ఒక మధ్యస్థ బీట్‌రూట్ తురిమి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల బాదం నూనె కలపి తయారు చేసుకోవాలి.. ముఖం, మెడపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బీట్‌రూట్ – క్రీమ్ ఫేస్ మాస్క్
చర్మంలోని ట్యాన్‌ను తగ్గించడంలో ఈ మాస్క్ సహాయపడుతుంది.. 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం, 1 టీస్పూన్ తాజా క్రీమ్ (సోర్ క్రీమ్) కలపి తయారు చేసుకోవచ్చు.. ఇక, ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

4. బీట్‌రూట్ – నారింజ తొక్కల ఫేస్ మాస్క్
తక్షణ సహజ మెరుపు కోసం ఇది ఉత్తమమైన మాస్క్ ఇది.. 2 టీస్పూన్ల నారింజ తొక్కల పొడి, 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం కలిపి మందపాటి పేస్ట్ చేయాలి.. ఆ తర్వాత ముఖం, మెడకు అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. బీట్‌రూట్ సాధారణంగా చర్మానికి సురక్షితం. అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. సున్నితమైన లేదా దీర్ఘకాలిక చర్మ సమస్యలు ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ చర్మ సంరక్షణలో మార్పులు చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • beetroot and carrot mask
  • beetroot and yogurt mask
  • Beetroot face mask
  • beetroot for skin
  • DIY skincare

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions