Heart attack: దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో గుండెపోటు రిస్క్ అధికమైంది. ఇతర దేశాలతో పోలిస్తే, భారత్‌లో చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. గుండెపోటుకు ఒక కారణంగా చెడు కొలెస్ట్రాల్(LDL) అని వైద్యులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల కన్నా, తక్కువ కొలెస్ట్రాల్ విలువలు ఉన్న భారతీయులకు కూడా గుండె సమస్యలు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల శరీర నిర్మాణం, కొవ్వు, చక్కెరలను శరీరం ప్రాసెస్ చేసే విధానం, వారసత్వ లక్షణాలు కూడా హార్ట్ ఎటాక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కారణాల వల్ల భారతీయుల్లో రక్తనాళాలు తొందరగా బ్లాక్ అవ్వడం, గుండె సంబంధిత సమస్యలు వెస్ట్రన్ దేశాలతో పోలిస్తే సగటున 10 ఏళ్ల కన్నా ముందే కనిపిస్తున్నాయి.
Read Also: 2026 Mega Summer: థియేటర్లలో దండయాత్రకు సిద్ధమైన మెగా హీరోలు!
జన్యుక్రమమే కాకుండా జీవనశైలి కూడా హార్ట్ ఎటాక్ రిస్క్ పెంచుతోంది. జంక్ ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం, చక్కెర వంటి అనారోగ్యమైన ఆహారం, శారీరకంగా చురుకుగా లేకపోవడం, అధిక ఒత్తిడి, బరువు పెరగడం ఈ సమస్యల్ని మరింత పెంచుతోంది. ఇది LDL (“చెడు” కొలెస్ట్రాల్) ను పెంచడమే కాకుండా, HDL (“మంచి” కొలెస్ట్రాల్) ను కూడా తగ్గిస్తాయి. ఈ మంచి కొలెస్ట్రాల్ ధమనుల్లో అడ్డంకుల్ని తొలగించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిజానికి ఈ హై కొలెస్ట్రాల్ అనేది నిశ్శబ్ధంగా ప్రమాదకరంగా మారుతాయి. ఇది ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు ఇవ్వదు. మనకు ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండెపోటు వచ్చే వరకు సమస్య ఉందని తెలియదు. 30+ వయసు తర్వాత, కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్న వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్, ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి గుండె ప్రమాదాలను తగ్గిస్తాయి. ఈ మార్పులతో LDL స్థాయిలను తగ్గడంతో పాటు HDL పెరుగుతుంది.