Heatwave Alert: ఎండలు దంచేస్తున్నాయి.. డీహైడ్రేషన్‌ను ఇలా ముందుగానే పసిగట్టండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave Alert: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. భారత వాతావరణ శాఖ పలుచోట్ల వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. మండే ఎండల మధ్య ఎక్కువగా బయట తిరిగేవారు, వృద్ధులు, పిల్లలు, కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయితే, డీహైడ్రేషన్ అంటే కేవలం దాహం వేయడం మాత్రమే కాదు. శరీరంలో నీరు, లవణాలు తగ్గిపోవడం వల్ల అలసట, తల తిరగడం, బలహీనత, గుండె వేగం పెరగడం, వడదెబ్బ వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. అయితే కొన్ని సాధారణ లక్షణాలను ఇంట్లోనే గుర్తించి ముందస్తుగా జాగ్రత్త పడవచ్చు.
1. చర్మపు బిగుతు పరీక్ష: చేతి వెనుక భాగంలోని చర్మాన్ని రెండు వేళ్లతో కొద్దిసేపు పట్టుకుని వదిలేయాలి. సాధారణంగా చర్మం వెంటనే మామూలు స్థితికి రావాలి. ఆలస్యంగా వస్తే శరీరంలో నీటి లోపం ఉండే అవకాశం ఉంది.
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
2. గోరు రంగు పరీక్ష: వేలిగోరును కొన్ని సెకన్లు నొక్కి వదిలేయాలి. వెంటనే గులాబీ రంగు తిరిగి వస్తే రక్తప్రసరణ సాధారణంగా ఉన్నట్టు. రెండు సెకన్లకు పైగా సమయం పడితే నీటి లోపం సంకేతంగా భావించవచ్చు.
3. మూత్రం రంగు పరిశీలించండి: మూత్రం లేత పసుపు లేదా పల్చని రంగులో ఉంటే శరీరంలో నీరు సరిపడా ఉందని అర్థం. ముదురు పసుపు, నారింజ లేదా గోధుమ రంగులో ఉంటే వెంటనే నీరు తాగాలి. ఇది డీహైడ్రేషన్ హెచ్చరిక కావచ్చు.
4. నోరు పొడిబారడం: నోరు పొడిగా ఉండటం, నాలుక పొడిగా అనిపించడం, లాలాజలం తగ్గిపోవడం కూడా నీటి లోపానికి సంకేతాలు. ఇలాంటి సమయంలో వెంటనే ద్రవాలు తీసుకోవాలి.
5. నిలబడగానే తల తిరగడం: కొంతసేపు కూర్చున్న తర్వాత ఒక్కసారిగా లేచినప్పుడు తల తిరగడం, మగతగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా డీహైడ్రేషన్ వల్ల కావచ్చు.
వెంటనే ఏమి చేయాలి?
– తరచుగా నీరు తాగాలి..
– నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి
– మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లడం తగ్గించాలి
– తేలికపాటి బట్టలు ధరించాలి
– కాఫీ, టీ, శీతల పానీయాలు అధికంగా తాగకూడదు
ఇంట్లోనే ORS తయారీ
ఒక లీటర్ నీటిలో ఆరు టీ స్పూన్లు చక్కెర, అర టీ స్పూన్ ఉప్పు కలిపి తాగవచ్చు. ఇది శరీరానికి కోల్పోయిన లవణాలు, ద్రవాలు తిరిగి అందించడంలో సహాయపడుతుంది. అయితే, జ్వరం, వాంతులు, స్పృహ కోల్పోవడం, నిలబడలేకపోవడం, మూత్రం పూర్తిగా తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వేసవిలో నీరు తాగడం అలవాటుగా మార్చుకుంటే డీహైడ్రేషన్‌ను సులభంగా దూరం పెట్టవచ్చు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!