Site icon NTV Telugu

Health Tips: హార్ట్ ఎటాక్ రాగానే 6 గంటల లోపు ఏం చేయాలి?

Heart1

Heart1

హార్ట్ ఎటాక్ రాగానే 6 గంటల లోపే ఇలా చెయ్యాలి.. లేదంటే..! | Dr Suresh Gude | Ntv Health Telugu

ఈరోజుల్లో చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గతంలో 60 ఏళ్ళ పైబడినవారు గుండెజబ్బుల బారిన పడితే వివిధ అనారోగ్య సమస్యల కారణంగా 40 ఏళ్ళు దాటినవారు, ఒక్కోసారి 30 ఏళ్ళ పైబడినవారు కూడా హఠాత్తుగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్ రాగానే 6 గంటల లోపే స్పందించాలి.

ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో ఎడతెరపి లేకుండా నొప్పిగా ఉన్నా, ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం గుండె పోటుకు సూచనగా భావించాలి. ఒకటి రెండు రోజులకు మించి ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కింది దవడ, మెడ, జీర్ణాశయం భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపించినా.. వెంటనే గుండె సంబంధిత వైద్యుడ్ని సంప్రదించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
శరీరంలో తీవ్రమైన అలసట వస్తుంది. ఏ పని చేసినా.. ఆయాసం రావడం వల్ల గుండెపోటుకు ముందు వచ్చే లక్షణంగా డాక్టర్లు చెబుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఛాతి పట్టేసినట్లు ఉన్నా.. వైద్యుడ్ని సంప్రదించాలి. ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఆసిడిటిగా భావించి చాలా మంది లైట్‌ తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో వచ్చే తీవ్రమయిన గుండెనొప్పికి ఇది సంకేతంగా భావించాలి. హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఆరుగంటల లోపే మూసుకుపోయిన రక్తనాళాలను యాంజియోగ్రామ్ చేయాలి. స్టంట్ లాంటివి ఏమైనా వేయాల్సి వస్తే వేయాలి. లేదంటే పర్మినెంట్ గా గుండె డ్యామేజ్ జరగవచ్చు.

Exit mobile version