Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Halwa: ఈ ఆధునిక యాంత్రిక జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే వచ్చే అనారోగ్యలపై అవగాహన పెరగడంతో అందరికీ వారి వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఏది పడితే అది తింటే ఆరోగ్యం అనిపించుకోదని, ఆరోగ్యానికి అవసరం అయ్యే వాటిని మాత్రమే వారి భోజనంలో భాగం చేసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో చిరుధాన్యాలతో చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేలా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ‘రాగి పిండి హల్వా’ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
- Pregnancy: గర్భిణులకు "కాస్మెటిక్స్" ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
- Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
- Beauty Tips: వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ అవసరమేనా?.. చర్మ నిపుణులు ఏం చెబుతున్నారు..
రాగి పిండి – 1 కప్పు
నీళ్లు – 2 కప్పులు (నానబెట్టడానికి)
బెల్లం – 1.5 కప్పులు (తీపిని బట్టి)
నీళ్లు – 1 కప్పు (బెల్లం పాకం కోసం)
సన్ ఫ్లవర్ ఆయిల్ – 5 చెంచాలు
యాలకుల పొడి – చిటికెడు
నెయ్యి – 1 చెంచా
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం) – తగినన్ని
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండిని తీసుకుని, అందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 40 నిమిషాల పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత, ఒక పల్చని వస్త్రం లేదా టీ వడకట్టే జాలీ సహాయంతో ఆ మిశ్రమాన్ని వడకట్టి ‘రాగి పాలను’ సేకరించాలి. మరోవైపు ఒక మందపాటి బాండీలో ఒకటిన్నర కప్పుల బెల్లం, ఒక కప్పు నీరు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగి, పాకం కాస్త జిగురుగా వచ్చే వరకు మరిగించాలి.
తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి మనం తీసి పెట్టుకున్న రాగి పాలను మెల్లగా పోస్తూ, గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ సమయంలోనే సువాసన కోసం యాలకుల పొడిని కూడా వేయాలి. హల్వా దగ్గర పడుతున్నప్పుడు, ఐదు చెంచాల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఒక్కో స్పూన్ చొప్పున వేస్తూ కలపాలి. చివరగా ఒక స్పూన్ నెయ్యి వేసి, హల్వా బాండీకి అంటుకోకుండా వేరు పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి హల్వా రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన వేయించిన జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేస్తే, ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి, ఎముకల బలం కోసం ఈ రాగి హల్వా ఒక అద్భుతమైన ఆహారమని చెప్పవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
చిరు ధాన్యాలన్నింటిలోకెల్లా రాగుల్లో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాకుండా, పెద్దవారిలో వచ్చే ‘ఆస్టియోపోరోసిస్’ (ఎముకల సాంద్రత తగ్గడం) వంటి సమస్యలను నివారిస్తుంది. పెరుగుతున్న పిల్లలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. రాగులు – బెల్లం రెండింటిలోనూ ఐరన్ (ఇనుము) సమృద్ధిగా ఉంటుంది. ఈ హల్వాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఒక వరప్రసాదం లాంటిది. మిగిలిన తీపి వంటకాలతో పోలిస్తే రాగి హల్వా చాలా వరకు మేలైనది. రాగుల్లో ఉండే పాలీఫెనాల్స్ – డైటరీ ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. బెల్లం వాడటం వల్ల తెల్ల చక్కెర ఇచ్చే అనారోగ్య ముప్పు ఉండదు. రాగులలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇందులోని అమినో యాసిడ్స్ కాలేయంలోని అదనపు కొవ్వును తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
రాగి హల్వా తయారీలో మనం రాగి పాలను ఉపయోగిస్తాం. ఇది చాలా తేలికగా ఉండి, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది సురక్షితమైన ఆహారంగా పని చేస్తుంది. రాగులలో ఉండే ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో యాసిడ్ సహజసిద్ధమైన రిలాక్సెంట్‌గా పనిచేస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల ఈ హల్వా తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. త్వరగా ఆకలి వేయదు, దీంతో అనవసరమైన జంక్ ఫుడ్ తినకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. వారంలో కనీసం రెండు సార్లు ఈ రాగి హల్వాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అటు తీపి కోరికను తీర్చుకోవడంతో పాటు, ఇటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలకు ఇది ఒక బెస్ట్ హెల్తీ స్నాక్‌గా పనిచేస్తుంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!