NTV Telugu Site icon

Aloe Vera : అలోవెరాతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

New Project (19)

New Project (19)

Aloe Vera : అలో వెరాను అందం సంరక్షణ కోసం వినియోగించే వివిధ రకాల ఉత్పత్తుల్లో వాడుతుంటారు. దాని రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీని తాగడం తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలోవెరా రసాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల డేండ్రఫ్ పోతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే అందంగా మెరుస్తుంది. అంతే కాకుండా అలోవెరాను ముఖానికి పెట్టుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. డెడ్ స్కిన్ సమస్య ఉండదు. అంతేకాదు ఇది చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Read Also : Fenugreek Seeds : ఆగకుండా అయ్యే విరేచనాలను కట్ చేసే అద్భుతమైన చిట్కా

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాదు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలోవెరా రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమం పొందడానికి సహాయపడతాయి. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ లక్షణాలకు చికిత్స చేయడానికి, తగ్గించడానికి అలోవెరా సిరప్ సహాయపడుతుందని కొన్ని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) చికిత్సకు అలోవెరా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలొస్తాయంటున్నాయి పలు పరిశోధనలు. శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ నివారణకు అలోవెరా తోడ్పడుతుంది. రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ ల నివారణకు సాయపడుతుంది. అలోవెరా దంత సంరక్షణకు కూడా మంచిది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతాయి.

Read Also: AP State Finance Commission: ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు హామీ ఏమైంది?

కలబంద జ్యూస్ ను ఎలా తయారు చేయాలి
మొదట తాజా కలబంద కాండాన్ని కత్తిరించండి. దీన్ని కత్తి లేదా చెంచాతో తొక్క తీసి లోపల జెల్ ను తీయండి. కలబంద స్కిన్ చేదుగా ఉంటుంది. అందుకే దాన్ని పక్కన పెట్టండి. ఈ జెల్ కు రెండు ముక్కలు అల్లం, అర టీస్పూన్ నిమ్మరసం, కొంత నీరు వేసి మిక్సీలో వేయండి. ఆ తర్వాత దీనిలో కొంచెం తేనే లేదా చక్కెరను వేసి తాగండి. 

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.