Aloe Vera : అలోవెరాతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aloe Vera : అలో వెరాను అందం సంరక్షణ కోసం వినియోగించే వివిధ రకాల ఉత్పత్తుల్లో వాడుతుంటారు. దాని రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీని తాగడం తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలోవెరా రసాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల డేండ్రఫ్ పోతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే అందంగా మెరుస్తుంది. అంతే కాకుండా అలోవెరాను ముఖానికి పెట్టుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. డెడ్ స్కిన్ సమస్య ఉండదు. అంతేకాదు ఇది చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Read Also : Fenugreek Seeds : ఆగకుండా అయ్యే విరేచనాలను కట్ చేసే అద్భుతమైన చిట్కా
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాదు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలోవెరా రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమం పొందడానికి సహాయపడతాయి. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ లక్షణాలకు చికిత్స చేయడానికి, తగ్గించడానికి అలోవెరా సిరప్ సహాయపడుతుందని కొన్ని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) చికిత్సకు అలోవెరా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలొస్తాయంటున్నాయి పలు పరిశోధనలు. శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ నివారణకు అలోవెరా తోడ్పడుతుంది. రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ ల నివారణకు సాయపడుతుంది. అలోవెరా దంత సంరక్షణకు కూడా మంచిది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతాయి.
Read Also: AP State Finance Commission: ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు హామీ ఏమైంది?
కలబంద జ్యూస్ ను ఎలా తయారు చేయాలి
మొదట తాజా కలబంద కాండాన్ని కత్తిరించండి. దీన్ని కత్తి లేదా చెంచాతో తొక్క తీసి లోపల జెల్ ను తీయండి. కలబంద స్కిన్ చేదుగా ఉంటుంది. అందుకే దాన్ని పక్కన పెట్టండి. ఈ జెల్ కు రెండు ముక్కలు అల్లం, అర టీస్పూన్ నిమ్మరసం, కొంత నీరు వేసి మిక్సీలో వేయండి. ఆ తర్వాత దీనిలో కొంచెం తేనే లేదా చక్కెరను వేసి తాగండి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!