NTV Telugu Site icon

Weight Loss: జిమ్, వ్యాయమం చేయకుండా బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా..!

Weight Loss

Weight Loss

మీ బరువు మీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కంటే ఎక్కువగా ఉంటే.. అది ఇబ్బంది కలిగించే విషయం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది శరీరం బరువు అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సాధారణ గణన. మీ బరువు BMI కంటే కొంచెం ఎక్కువగా ఉంటే.. దానిని ఆహారం ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. కానీ అధికంగా ఉంటేనే సమస్య. బరువు పెరగడం, ఊబకాయం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది.. చెడు జీవనశైలి, ఆహారం, శరీర కార్యకలాపాల వల్ల వస్తాయి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెల్త్‌లైన్ ప్రకారం, మీరు పెరుగుతున్న బరువును నియంత్రించకపోతే.. మీ శరీరంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయి.. ఇది శరీరంలోని వివిధ అవయవాలు, పనితీరు వ్యవస్థలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో.. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, శ్వాస సమస్యలు, స్లీప్ అప్నియా, కీళ్ల నొప్పులు వంటివి సంభవిస్తాయి.

బరువును కంట్రోల్ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడిని నియంత్రించాలి. బరువు తగ్గేందుకు జిమ్ లు, వ్యాయమం చేసేంత సమయం లేకపోతే.. కొన్ని కేలరీల బర్నింగ్ కార్యకలాపాలను అనుసరించవచ్చు. వీటి సహాయంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మీ బరువును నియంత్రించే శరీర కార్యకలాపాలు ఏమిటో తెలుసుకుందాం..

YV Subba Reddy: ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు.. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాం..

నిలబడి పని చేయాలి:
మీరు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో గంటల తరబడి కూర్చుని పని చేస్తే.. బరువు పెరగడం ఖాయం. అయితే.. మీరు కేలరీలను బర్న్ చేయాలనుకుంటే, మీ ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి.. కొంత సమయం పాటు నిలబడి పని చేయాలి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. నిలబడి పని చేయడం ద్వారా.. మీరు ఎటువంటి శ్రమ లేకుండా మీ కేలరీలను బర్న్ చేసుకోవచ్చు.

స్వీపింగ్, మాపింగ్:
వ్యాయమం చేయడానికి సమయం లేకపోతే ఇంట్లో ఉండే దుమ్ము దులిపే పనిని చేయండి. అంతేకాకుండా.. వాక్యూమింగ్, స్వీపింగ్, మాపింగ్ చేయడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. ఇలా ఇంటిని శుభ్రపరచడం ద్వారా కేలరీలను బర్న్ చేసుకోవచ్చు. జిమ్, వ్యాయామం లేకుండా బరువు తగ్గవచ్చు.

తగినంత నిద్ర పోవాలి:
తక్కువగా నిద్రపోవడం వల్ల ఊబకాయం అనేది వేగంగా పెరుగుతుంది. బరువును నియంత్రించుకోవడానికి రోజూ 7-8 గంటల నిద్ర పోవాలి. తగినంత నిద్ర మీ జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది.

ఎక్కువ నీరు త్రాగండి:
మీరు బరువు తగ్గాలనుకుంటే ఎక్కువగా నీరు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.. జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా.. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి శరీరంలో కేలరీలు తగ్గుతాయి. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల పని సామర్థ్యం పెరుగుతుంది. అలాగే.. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తాగడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ నడవండి:
మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ కొంత సమయం పాటు నడవాలి. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Show comments