Without Makeup: మేకప్ లేకుండా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ మీకోసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Without Makeup: ప్రతి ఒక్కరికి ఆరోగ్యమైన మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందం పెంచుకోవడానికి మేకప్ వేసుకుంటారు. చాలా మంది అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. మేకప్ వల్ల చర్మం సహజమైన కాంతిని కోల్పోతుంది. మేకప్ వేసుకోవడం కంటే సహజమైన ఫేషియల్ గ్లో కలిగి ఉండటమే అసలైన అందం. మేకప్ వల్ల ముఖాన్ని ప్లాస్టిక్ పువ్వులా ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు, కానీ మేకప్ లేకుండానే మీ ముఖం సహజమైన, అందమైన పువ్వు వికసించినట్లు కనిపిస్తుంది. మీ ముఖం నయం కావడానికి తగినంత ఆక్సిజన్, నీరు అవసరం. తీవ్రమైన జీవనశైలి, నిద్రలేమి, పర్యావరణ కాలుష్యాలు, కాలానుగుణ మార్పుల ఫలితంగా మన చర్మం నిర్జీవంగా మారుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలను కొన్ని సింపుల్.. ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Read also: Bhakthi TV LIVE: బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే ..?
Also Read
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- AMH తక్కువగా ఉంటే IVF తప్పనిసరా? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు...
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
తగినంత నీరు తాగడం..
శరీరంలోని ప్రతి అవయవానికి.. ప్రతి కణానికి నీరు చాలా అవసరం. కాబట్టి తగినంత నీరు త్రాగడం వల్ల మొత్తం శరీరానికి వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది, వాటిలో ఒకటి మంచి చర్మం. మీరు హైడ్రేటెడ్ గా ఉంటే, మీ ముఖం మెరుస్తుంది. లేకుంటే కళావిహీనంగా కనిపిస్తుంది. కాబట్టి నీరు, ఎలక్ట్రోలైట్స్ కలిగి ఉన్న స్వచ్ఛమైన కొబ్బరి నీటిని తాగండి.
ముఖకాంతి కోసం..
మీ చర్మాన్ని శుభ్రపరచడం అనేది స్పష్టమైన రంగును సాధించడానికి మీరు తీసుకోవలసిన ముఖ్యమైన రోజువారీ దశ. ప్రతిరోజూ పడుకునే ముందు .. ఉదయం నిద్ర లేవగానే మీ చర్మాన్ని శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి. వ్యాయామం చేయడం, ఆడుకోవడం మరియు బయట తిరగడం వల్ల చర్మంపై దుమ్ము, చెమట, ధూళి మరియు సూక్ష్మజీవులు పేరుకుపోతాయి. కాబట్టి మీ చర్మాన్ని శుభ్రపరచడం, అప్పుడప్పుడు సహజమైన రోజ్ వాటర్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
వేడి నీరు..
మీ ముఖాన్ని వేడినీటితో కడగడం వల్ల మీ చర్మాన్ని తేమగా.. మృదువుగా ఉంచే సహజ నూనెలు తొలగిపోతాయి. వేడి నీరు మీ చర్మాన్ని పొడిబారుతుంది. ఇది మీ చర్మం యొక్క సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. మీరు మీ చర్మాన్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది దాని ఆరోగ్యం, దృఢత్వం, ఆకృతిని ప్రభావితం చేస్తుంది.
చర్మ కాంతి..
నేచురల్ స్కిన్ గ్లో పొందడానికి తరచుగా మేకప్ వేసుకోకండి. కనీసం వారంలో ఒకరోజు మీ ముఖంపై ఎలాంటి ఫేషియల్ క్రీమ్‌లు.. సౌందర్య సాధనాలను అప్లై చేయడం మానుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది. కానీ బయటకు వెళ్లేటప్పుడు హానికరమైన సూర్యకిరణాల ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించవచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
-
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..