Site icon NTV Telugu

Summer Heat: వేసవిలో పెరుగుతున్న కడుపు ఇన్ఫెక్షన్లు.. ఈ లక్షణాల ఉంటే జాగ్రత్త..

, Gastrointestinal Infections,

, Gastrointestinal Infections,

Summer Heat: ఈ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రం గతంలో పోలిస్తే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వేసవిలో కడుపులో ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. డీ హైడ్రేషన్, లో బీపీ వంటి సమస్యల వంటి హెచ్చరికల్ని విస్మరించొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో చాలా మందికి గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో పాటు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి.

గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది కడుపు మరియు ప్రేగులలోని లైనింగ్ వాపును సూచిస్తుంది. ఇది విరేచనాలు, వాంతులకు దారి తీస్తుంది. సాధారణంగా ఈ లక్షణాల కలయిక బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించొచ్చని వైద్యలు చెబుతున్నారు. ఇవి కొన్నిసార్లు తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారి తీయవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇది అనారోగ్య కాలాన్ని పొడగించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. న్యూఢిల్లీలోని ఆకాష్ హెల్త్‌కేర్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ హెపటాలజీ & థెరప్యూటిక్ ఎండోస్కోపీ సీనియర్ కన్సల్టెంట్ & హెచ్‌ఓడి డాక్టర్ శరద్ మల్హోత్రా మాట్లాడుతూ.. వేసవిలో కడుపుకు సంబంధించి చాలా వ్యాధులు ఉంటాయి, వీటిలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు.

Read Also: Amit shah Fake video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. మరో పీసీసీ అధ్యక్షుడికి సమన్లు..

ఈ ఆరోగ్య సమస్యలు కలుషిత ఆహారం, నీటికి సంబంధించినవి కావచ్చు లేదా వైరల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. వాతావరణ మార్పులు కూడా గ్యాస్ట్రిక్ అసాధారణతకు దారి తీస్తుందని వైద్యులు చెప్పారు. వేసవిలో తగినంత నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ జ్వరంతో పాటు గ్యాస్ట్రోఇంటెస్టినల్ వ్యాధులకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో అపరిశుభ్రత, పారిశుద్ధ్య సమస్యలు కూడా వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలని, పచ్చిగా ఉండే ఆహారం, తక్కువగా ఉడికించే ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎండ వేడికి ఉండొద్దని, మద్యం వంటి డీహైడ్రేటింగ్ పానీయాల జోలికి వెళ్లొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లు మసకబారి పోవడం, పల్స్ పెరగడం, తక్కువ రక్తపోటు, పొడి నాలుక వంటి నిర్జలీకరణ సంకేతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.స్పృహ కోల్పోవడం, పురీషనాళంలో రక్తస్రావం, నిరంతర అధిక-స్థాయి జ్వరం మరియు నిరంతర వాంతులు వంటి సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాలని చెబుతున్నారు.

Exit mobile version