NTV Telugu Site icon

Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?

Stroke

Stroke

Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.

స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వైకల్యం, మరణాలకు కారణమవుతుంది. ఒక్కోసారి పక్షవాతం వల్ల శరీరంలో ఒక వైపు భాగాలు పనిచేయకుండా పోతాయి. గతంలో దీర్ఘకాలిక వాయుకాలుష్యం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చిందని అమ్మాన్ లోని జోర్డాన్ యూనివర్సిటీ ప్రధాన రచయిత అహ్మద్ తౌబాసి చెప్పారు. అయితే స్వల్పకాలికంగా వాయుకాలుష్యం ఎలాంటి వ్రభావం చూపిస్తుందో అని పరిశోధిస్తే.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, స్వల్పకాలిక వాయుకాలుష్యం కూడా కేవలం 5 రోజుల్లో స్ట్రోక్ కి కారణమవుతుందని తేలిందని వెల్లడించారు.

Read Also: Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే

110 అధ్యయనాల్లో 18 మిలియన్లకు పైగా స్ట్రోక్ కేసుల్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాల ప్రభావాన్ని విశ్లేషించారు. 1 మైక్రాన్, PM2.5, PM10, PM1 వంటి పరిమాణాలు ఉన్న వాయుకాలుష్య రేణువుల్ని పరిశీలించారు. PM2.5 కాలుష్య రేణువుల వాహనాలు, పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధనాలు కాల్చడం వల్ల వెలువడుతుంది. అధిక సాంద్రత కలిగిన కాలుష్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 28 శాతం, ఓజోన్ స్థాయిలు వల్ల 5 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ 26 శాతం, సల్ఫర్ డయాక్సైడ్ 15 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉందని తెలిపారు. PM1 అధిక సాంద్రత వల్ల 9 శాతం, PM2.5 కాలుష్యం వల్ల 15 శాతం, PM10 వల్ల 14 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు తేలింది. అయితే 60 శాతం నైట్రోజన్ డయాక్సడ్ సాంద్రత ఉంటే 33 శాతం స్ట్రోక్స్ మరణాలకు దారి తీస్తుందని, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల 60 శాతం, పీఎ 2.5 వల్ల 9 శాతం, పీఎం 10 వల్ల 2 శాతం వల్ల స్ట్రోక్ రిలేటెడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని తేలింది.