Site icon NTV Telugu

MCED Blood Test: ఈ బ్లెడ్‌ టెస్ట్‌తో క్యాన్సర్‌ను ఇట్టే కనుక్కోవచ్చు..

Cancer

Cancer

MCED Blood Test Detects Cancer Early: ప్రజలను రోజురోజుకు క్యాన్సర్ విస్పోటనం కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా మారుతోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్‌కు తెలిపిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో క్యాన్సర్ల కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి. అయితే.. “క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది” అనే మాటను మనం తరచూ వింటూనే ఉంటాం. క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షలు గురించి ఆందోళన చెందుతుంటాం.. ఈ అంశంపై తాజాగా ఓ అధ్యయనం వెలువడించింది. రక్త పరీక్షల ద్వారా సైతం క్యాన్సర్‌ను గుర్తించవచ్చని నివేదిక వెల్లడించింది.

READ MORE: Ashley Tellis: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లిస్ అరెస్టు

క్వీన్‌మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ అధ్యయనం ప్రకారం.. క్యాన్సన్‌ను తొలి దశలోనే గుర్తించేందుకు మల్టీ-క్యాన్సర్‌ ఎర్లీ డిటెక్షన్‌ (ఎంసీఈడీ) రక్త పరీక్షలు బాగా తోడ్పడగలవు. ఇవి క్యాన్సర్లలో దాదాపు సగం రకాలను తొలిదశలోనే గుర్తించగలవు. ప్రస్తుతం పాటిస్తున్న క్యాన్సర్‌ ముందస్తు పరీక్షల సూచనలతో ఈ పరీక్షలను ఏటా లేదా రెండేళ్లకోసారి చేయగలిగితే చివరి దశ క్యాన్సర్‌తో ముడిపడిన చాలా మరణాలను తగ్గించొచ్చు. కణితుల నుంచి వెలువడిన డీఎన్‌ఏ పోచల వంటి క్యాన్సర్‌ సంబంధ సంకేతాలను ఎంసీఈడీ పరీక్షలు గుర్తిస్తాయి.

READ MORE: ఇండియన్ వెర్షన్ కంటే బెస్ట్ అప్‌గ్రేడ్ ఫీచర్లతో అక్కడ iQOO Z10R 5G లాంచ్..!

ఇప్పుడు రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తి క్యాన్సర్ల వంటి వాటి ముప్పు అధికంగా ఉన్నవారికి చేసే ముందస్తు పరీక్షల్లో కొన్ని మాత్రమే కచ్చితంగా గుర్తిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అదే రక్త పరీక్షలతో డజన్ల కొద్దీ వేర్వేరు క్యాన్సర్ల రకాలను గుర్తించే అవకాశముందని వివరిస్తున్నారు. ఈ అధ్యయనంలో సాధారణంగా చేసే క్యాన్సర్‌ ముందస్తు పరీక్షల్లో రక్త పరీక్ష ప్రాధాన్యాన్ని అంచనా వేయటానికి గతంలో నిర్వహించిన ప్రయోగ పరీక్షలను విశ్లేషించారు. రకరకాల క్యాన్సర్లను తొలిదశలోనే మరింత ఎక్కువగా గుర్తించటానికివి తోడ్పడుతున్నాయని కనుగొన్నారు.

Exit mobile version