Diwali Safety Tips for Pregnants: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఈరోజు (అక్టోబర్ 20న) జరుపుకోనున్నారు. అయితే, ఈ పండగ సమయంలో కాలుష్యం కూడా బాగా పెరిగిపోతుంటుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మరీ ముఖ్యంగా, పండగపూట గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొగ, భారీ శబ్దాలకు దూరంగా ఉండటం బెటర్. లేదంటే పుట్టబోయే బిడ్డపై దీని ప్రభావం పడుతుంది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. టాపాకుల నుంచి వెలువడే పొగ, రసాయనాలు గాలిలో కార్బన్ కణాలను పెంచుతాయి.. ఇది గర్భిణులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. కావునా, దీపావళి సందర్భంగా గర్భిణులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Read Also: Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ
అలాగే, గర్భిణీ స్త్రీలు దీపావళి పండగ నాడు స్వీట్లు తినవచ్చు, కానీ వాటి పరిమాణాన్ని గుర్తు పెట్టుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ స్వీట్లు తినడం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అధిక బరువు ఉన్న లేదా కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉన్నా అలాంటి మహిళలు తక్కువ మోతాదులో స్వీట్లు తినాలి. ఇక, ఎక్కువగా వేయించిన లేదా కారం ఉండే ఆహారాన్ని కూడా అస్సలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. త్రాగే నీరుపై కూడా శ్రద్ధ వహించాలి.. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచి నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.