NTV Telugu Site icon

Ration Rice Benefits: రేషన్ బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Ration Rice

Ration Rice

రూపాయికే కిలో, లేదా ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని అందరూ చులకనగా చూస్తారు. ప్రతి నెలా వచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటూ.. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యం కొనుగోలు చేస్తుంటారు. రేషన్ బియ్యం తింటే శరీరానికి అస్సలు మంచిది కాదనే వదంతులను కొట్టి పారేయండి.. ఇకపై రేషన్ బియ్యం అమ్మవద్దు. ఎందుకో తెలుసా? రేషన్ బియ్యంలో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయి.

READ MORE: Central Team: పోలవరం ముంపు గ్రామాల్లో కేంద్ర బృందం.. పరిహారం ఇస్తే ఖాళీ చేసేందుకు సిద్ధం..

చిన్నారులు, యువత, గర్భిణుల్లో రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక వెల్లడించింది. రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేస్తోంది. అంతే కాకుండా ఈ బియ్యంలో తక్కువ కొవ్వు, సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంతో తొడ్పడుతుంది. రేషన్ బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నందున.. శరీరానికి ఇంధనంలా పని చేస్తుంది. అంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మెదడు సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిని నయం చేయడానికి మధుమేహ నిపుణులు ఈ రేషన్ బియ్యాన్ని సిఫార్సు చేస్తున్నారు. సన్నగా ఉన్నవారు రోజూ ఇది తింటే బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో జింక్, విటమిన్ ఎ, థైయమిన్, రెబోఫ్లోమిన్, న్యాసిన్, విటమిన్ బి6 వంటి ప్రత్యేక పోషకాలు కూడా కలుపుతారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.

READ MORE: CM Revanth Reddy : మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు