కరివేపాకు టీతో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం జనరల్‌గా కరివేపాకుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కూరల్లో అవి వస్తే… తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీరు గనుక అలా చేస్తూ ఉంటే… కనీసం కరివేపాకులతో టీ తాగే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే అద్భుత ప్రయోజనాలు అలాంటివి. సౌత్ ఇండియాలో కరివేపాకుల టీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమాటకొస్తే ఇప్పుడు దేశంలో చాలా మంది దీన్ని తాగుతున్నారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. కరివేపాకు మనకు అన్ని చోట్లా లభిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఏయే లాభాలు కలిగిస్తుందో తెలుసుకుందాం. దాని కంటే ముందు టీ తయారీ నేర్చుకుందాం.
Read Also : రోజుకు ఓ రెండు లవంగాలు అలా నోట్లో వేసుకుంటే కలిగే 10 లాభాలు ఇవే..
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
ముందుగా 25-30 కరివేపాకులను తీసుకోండి. స్వచ్ఛమైన నీటితో వాటిని సుతిమెత్తగా కడగండి. ఓ గిన్నెలో ఓ కప్పు నీటిని ఉడికించండి. మంట ఆర్పేసి… కరివేపాకుల్ని నీటిలో వెయ్యండి. ఆకులన్నీ ఉడికే వేడి నీటిలో మునిగేలా చెయ్యండి. నీటి రంగు మారడాన్ని గమనించండి. రంగు మారగానే… నీటిని కప్పులోకి ఫిల్టర్ చెయ్యండి. అంతే కరివేపాకు టీ రెడీ. దీనికి మీరు అదనంగా తేనె, బెల్లం (నల్లబెల్లం ఇంకా ఎక్కువ ప్రయోజనం) వంటివి కలిపి తాగొచ్చు. లేదా… తేనె, నిమ్మరసం కలిపి తాగొచ్చు. ఇప్పుడు కరివేపాకు టీ ప్రయోజనాలు తెలుసుకుందాం. మన దేశంలో చాలా మంది మలబద్ధకం (Constipation) సమస్య ఉంది. అలాంటి వారు ఈ టీ తాగితే… కడుపులో సమస్యలన్నీ పరారవుతాయి. తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుంది. మూత్రాశయం బాగా పనిచేస్తుంది. పొట్టలో గ్యాస్, మూత్ర విరేచనాల వంటివన్నీ ఈ టీ తాగుతూ ఉంటే… ఆటోమేటిక్‌గా నయమవుతాయి. డయాబెటిస్ (Diabetes – షుగర్) సమస్య ఉన్నవారు తాగేందుకు ఇదో బెస్ట్ టీ అనుకోవచ్చు. ఇది బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగనివ్వదు. అంతేకాదు… లెవెల్స్ ఎక్కువగా ఉంటే… సరిచేస్తుంది. చికాగో యూనివర్శిటీలో జరిపిన పరిశోధనలో కరివేపాకుల టీ… బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని 45 శాతం తగ్గిస్తున్నట్లు తేలింది. ఇంతకంటే ఏం కావాలి. (credit – twitter – Blaine Gobbels) ప్రెగ్నెంట్ మహిళలకు వికారం, వామ్టింగ్స్ వస్తున్న ఫీల్ కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు కరివేపాకుల టీ తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ప్రయాణాలకు వెళ్లే ముందు… ఈ టీ తాగితే… జర్నీలో వాంతులు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే అసౌకర్యంగా ఫీలయ్యే వారు ఈ టీ తాగితే… ఫుల్ జోష్ వచ్చేస్తుంది. కరివేపాకుల్లో ఫెనోలిక్స్, యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి అడ్డమైన చర్మ వ్యాధులు రాకుండా చేస్తాయి. చర్మ కణాలు పాడవకుండా కాపాడతాయి. కాన్సర్‌ను అడ్డుకుంటాయి. బాడీలో వేడిని తగ్గిస్తాయి. మీరు ఎప్పుడూ టెన్షన్లతో ఉంటారా… అయితే… కరివేపాకుల టీ మీకు రిలాక్స్ కలిగిస్తుంది. ఇది మీ నరాలపై ప్రభావం చూపి… మీకు ప్రశాంతత కలిగిస్తుంది. పని చేసి బాగా అలసిపోతే… కరివేపాకు టీ తాగేయడం మేలు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే… ఇప్పుడు ఈ టీ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!