Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Mixture: సాయంత్రం పూట టీ లేదా కాఫీ తాగేటప్పుడు పక్కన ఏదైనా క్రిస్పీగా, రుచిగా ఉండే స్నాక్స్ ఉంటే ఆ మజానే వేరు. అయితే బయట దొరికే జంక్ ఫుడ్స్ కంటే ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరంగా, బలవర్ధకంగా చేసుకునే స్నాక్స్ ఎప్పుడూ బెటర్. అలాంటి ఒక సూపర్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీయే “స్పెషల్ రాగి మిక్సర్”. నిజానికి రాగులలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయనీ మనందరికీ తెలిసిందే. రాగి జావ, రాగి సంకటి తినడానికి ఇష్టపడని పిల్లలకు.. ఇలా క్రిస్పీగా, కాస్త స్పైసీగా రాగి మిక్సర్ చేసి పెడితే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. పండగలు, సెలవు రోజుల్లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ స్పెషల్ రాగి మిక్సర్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
రాగి పిండి
శనగపిండి
పల్లీలు
జీడిపప్పు
పుట్నాల పప్పు
కరివేపాకు
ఉప్పు
కారం
పసుపు
నూనె (సరిపడా)
నీళ్లు
తయారీ విధానం:
ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి, శనగపిండి, తగినంత ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా జారుడుగా (దోసెల పిండి కంటే కొంచెం పల్చగా) కలుపుకోవాలి. తర్వాత కాగుతున్న నూనెలో బూందీ గరిటె సహాయంతో కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని వేసి, చిన్న చిన్న బూందీ గింజల్లాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత అదే నూనెలో పల్లీలను, జీడిపప్పును, పుట్నాల పప్పును విడివిడిగా దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. పుట్నాల పప్పు వేయించాక దానికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇకపోతే మిగిలిన రాగి పిండి మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో వేసి, కాగుతున్న నూనెలో సన్నటి కారప్పూసలాగా ఒత్తుకుని, బాగా వేగిన తర్వాత నూనె నుండి వేరు చేయాలి. లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకును కూడా నూనెలో క్రిస్పీగా వేయించి తీసుకోవాలి. ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు మిశ్రమంలో తగినంత ఉప్పు, కారం, ఇతర మసాలా పొడులను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుల మిశ్రమానికి ముందుగా సిద్ధం చేసుకున్న రాగి బూందీ, రాగి కారప్పూస (ముక్కలుగా చేసి), వేయించిన కరివేపాకును వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా చేత్తో చక్కగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన స్పెషల్ రాగి మిక్సర్ రెడీ అయిపోయింది.
ఆరోగ్య ప్రయోజనాలు..
తృణధాన్యాలన్నింటిలోకి రాగులలో క్యాల్షియం శాతం చాలా ఎక్కువ. ఇది ఎముకలను, పళ్లను బలంగా ఉంచడమే కాకుండా.. వయసు పైబడిన వారిలో వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) సమస్యను నివారిస్తుంది. ఎదిగే పిల్లలకు ఇది ఒక సూపర్ ఫుడ్‌గా పని చేస్తుంది. రాగులలో ఐరన్ (ఇనుము) పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు, గర్భిణీలు రాగితో చేసిన దీనిని తీసుకోవడం వల్ల వారి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని సహజంగానే పెంచుకోవచ్చు.
ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, కాబట్టి అనవసరమైన జంక్ ఫుడ్స్ తినకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. రాగులలో ఉండే పాలిఫెనాల్స్, ఫైబర్ కారణంగా ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అకస్మాత్తుగా పెరగనివ్వవు. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది హెల్తీ స్నాక్ ఆప్షన్‌గా పని చేస్తుంది. ఈ మిక్సర్‌లో ఉపయోగించే పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పుల వల్ల శరీరానికి అవసరమైన గుడ్ ఫ్యాట్స్ (మంచి కొవ్వులు), ప్రోటీన్లు అందుతాయి. ఇవి శరీరానికి రోజంతా కావాల్సిన తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రాగి సహజంగానే గ్లూటెన్-ఫ్రీ ధాన్యం. గోధుమలు లేదా ఇతర గ్లూటెన్ పదార్థాలు పడని వారు నిశ్చింతగా ఈ రాగి మిక్సర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి మిక్సర్‌ను కుదిరితే మీ ఇంట్లో కూడా ఒక సారి ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!