కోటీశ్వరులైనా సరే అనారోగ్యానికి గురైతే జీవితం నరకప్రాయమవుతుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంటారు. ఎందుకంటే వ్యాధులకు పేద, ధనిక అనే తేడాలుండవు కదా. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పాలు, పండ్లు, ఆకు కూరలు, చిరు ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి. కాగా వంటల్లో ఉపయోగించే కొత్తి మీరను తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొత్తిమీరతో ఆ రోగాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు.
కొత్తిమీరను కూరల్లో రుచి కోసం వాడుతుంటారు. కొత్తిమీరతో కర్రీస్‌కి మంచి టేస్ట్ వస్తుంది. రుచితో పాటు కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి కొత్తిమీర తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీరలో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వాటితో పాటు ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్-సీ కూడా ఉంటాయి. కొత్తిమీరను వంటల్లోనే కాకుండా.. పచ్చిగా తింటే కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి కొత్తిమీర తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుత ఔషధం.
పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. షుగర్ ఉన్న వాళ్లు పచ్చి కొత్తిమీర తినడం ఎంతో మంచిది. ప్రతి రోజూ కొంచెం పచ్చి కొత్తిమీర నమిలి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. పచ్చి కొత్తమీర తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. పచ్చి కొత్తమీర తింటే గుండెకు ఎంతో మంచిది. పచ్చి కొత్తిమీర తింటే మీ కళ్లకు ఎంతో మంచిది. కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ ఔషధ గుణాలుంటాయి.