Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • మలబద్ధకం ఎందుకు వస్తుంది? ప్రధాన కారణాలు
  • ఎండు ద్రాక్ష-నెయ్యి డ్రింక్ ఎలా తయారు చేయాలి?
  • ఈ మ్యాజికల్ డ్రింక్ ఎలా పనిచేస్తుంది?
  • మలబద్ధకం రాకుండా పాటించాల్సిన అలవాట్లు
Constipation

Constipation

 Natural Remedy for Constipation:  ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మందిని వేధించే ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ఇతర తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఖరీదైన మందుల జోలికి వెళ్లకుండా మన వంటింట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో దీనికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. లైఫ్‌స్టైల్ కోచ్ అను త్రిపాఠి సూచించిన ఈ ప్రత్యేక పానీయంతో కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. అదేంటో చూద్దాం..

US-Iran Conflict: దుబాయ్ హోటళ్లపై దాడులు చేస్తాం.. యూఎస్‌కు ఇరాన్ అల్టిమేటం..

కావలసిన పదార్థాలు:

  • ఎండు ద్రాక్ష (Raisins): సుమారు 5-6 గింజలు.
  • నెయ్యి (Ghee): ఒక అర స్పూన్.
  • గోరువెచ్చని నీరు: ఒక గ్లాసు.

 

తయారీ విధానం:

  • ముందుగా ఎండు ద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
  • మరుసటి రోజు ఉదయం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
  • ఆ నీటిలో అర చెంచా నెయ్యి కలపాలి.
  • నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటూ, ఈ నెయ్యి కలిపిన గోరువెచ్చని నీటిని తాగాలి.

ఇది ఎలా పనిచేస్తుంది?

  • ఎండు ద్రాక్ష: వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేసి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది.
  • నెయ్యి: నెయ్యి ప్రేగులకు మంచి జిగురును (Lubrication) అందిస్తుంది. దీనివల్ల వ్యర్థాలు సులభంగా బయటకు విసర్జించబడతాయి.
  • గోరువెచ్చని నీరు: శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

మరికొన్ని ముఖ్యమైన సూచనలు:

  • కేవలం ఈ డ్రింక్ మాత్రమే కాకుండా, మలబద్ధకం దరిచేరకుండా ఉండాలంటే ఇవి పాటించాలని అను త్రిపాఠి సూచిస్తున్నారు:
  • రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
  • ఆహారంలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి

 
Iran Missile Man: అమెరికానే అల్లాడిస్తున్న ఇరాన్ ‘మిస్సైల్ మ్యాన్’.. ఇరాన్ రాకెట్లకు ‘బాస్’ ఇతనే?