Children Teeth Problems: రోజుకి 2 సార్లు తప్పకుండా బ్రష్ చేసుకోవాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా! చిన్నారులకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ఏదైనా ఆహారం తిన్న తర్వాత నోటిలో కొంచెం నీరు పోసి పుక్కిలించాలి. అయితే.. చాలా మంది చిన్నారులకు చిన్న వయస్సులోనే దంత సమస్యలు ఉంటాయి. పిల్లలు స్వీట్లు ఎక్కువగా తినడం వల్లే ఈ దంత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు దంతాల సమస్యలు సర్వసాధారణం. ప్రసవ దంతాలు, నవ జాత దంతాల సమస్యలు చిన్న పిల్లలలో వస్తాయని చెప్పారు. ఎదుగుదల లేకపోవడం వల్ల పుట్టినప్పుడు పిల్లలు అరుదుగా దంతాలు కలిగి ఉంటారు. దానివల్ల వారి దంతాలు గట్టిగా ఉండవు.. పూర్తిగా లూజ్ లూజ్ గా ఉంటాయి.
Read also: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ఇది పాలిచ్చే తల్లులకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో పిల్లలు కొరకడం వల్ల తల్లికి పుండ్లు పడతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఈ పుండ్లు వల్ల తల్లులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలిచ్చే చోటులో పుండ్లు ఏర్పడమే కాకుండా.. పిల్లలు అలాంటి దంతాలతో కొరకడం వలన రక్తం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. దానిని చిన్నారులు అలాగే తాగుతుంటారు. దానివల్ల చిన్నారులకు కూడా శరీరక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి, అలాంటి దంతాలను వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తు్న్నారు. వాటికి విటమిన్ కె, సప్లిమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టిన ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు పాల దంతాలు వెర్షన్ జరుగుతూ ఉంటుందన్నారు. మళ్లీ ఆరు సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు పంటి వెర్షన్ జరుగుతూ ఉంటుంది. వాటి తరువాత ఎక్కువగా దంతాలు పుచ్చిపోవడం, నోట్లో దుర్వాసన రావడం వంటి సమస్యలను మనం చూస్తూ ఉంటాం. అయితే.. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏదైనా తిన్న వాటి రుచిని మనం కోల్పోతామన్నారు.
Jr.NTR : దేవర బయ్యర్స్ కు ఇక లాభాలే లాభాలు..